Janaki Kalaganaledu 26 Oct Today Episode : జ్ఞానాంబ ఇక జీవితంలో రామాతో మాట్లాడదా? తల్లీకొడుకులను విడదీసిన పాపం జానకికి చుట్టుకుంటుందా?
Janaki Kalaganaledu 26 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 157 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఏం చేస్తే అత్తయ్య గారు మీతో మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదు. నా కారణంగానే బంగారం లాంటి తల్లీ కొడుకుల మధ్య దూరం పెరిగింది. ఇది నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది.. అంటుంది జానకి. భోజనానికి వెళ్దాం పదండి అంటాడు రామా. అమ్మ భోజనం చేసిందో లేదో అని చెప్పి జ్ఞానాంబ గదిలోకి వెళ్లి చూస్తాడు. కానీ.. తను గదిలో ఉండదు. చూస్తే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోం చేస్తుంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి, రామా అక్కడికి వస్తారు. జ్ఞానాంబ పరధ్యానంగానే కూర్చొని ఉంటుంది. తినాలనే ఆసక్తి కూడా ఉండదు తనకు.
ఇంకా ఇంట్లో ఎవరెవరు భోం చేయాలి అని చికితను అడుగుతుంది జ్ఞానాంబ. ఒక పెదబాబు గారు, జానకి తినాలి అని అంటుంది. మీరు తినండి.. మీరు తిన్నాక వాళ్లు తింటారు అని అంటుంది చికిత. భోం చేద్దువుదా అని నిన్ను పిలవడానికే గంట పట్టింది. ముందు నువ్వు తిను.. తర్వాత వాళ్లు తింటారు కానీ అనగానే.. నేను ఎవరి కోసం ఆగడం లేదు.. అంటూ తింటుంది జ్ఞానాంబ.
మధ్యలో దూరి మళ్లీ మంట పెట్టాలని అనుకొని మల్లిక.. ఏదో ఒకటి అనబోతుంది.. దీంతో నువ్వు మళ్లీ మొదలు పెట్టావా? ఆపు.. అంటాడు గోవిందరాజు. ఇంతలో రామా వచ్చి ఆకలేస్తోంది అమ్మ.. అంటాడు రామా. ఏమండి.. మీకు రోజూ ఎవరు వడ్డిస్తారు అని జ్ఞానాంబ అడుగుతుంది. నువ్వే అంటాడు. ఎవరు ఎవరికి వడ్డిస్తారో కాస్త తెలుసుకోమ్మని చెప్పండి అంటుంది జ్ఞానాంబ. ముద్ద పెట్టు అమ్మ అని చేయి చాపుతాడు రామా. కానీ.. చేయి తీసేస్తుంది జ్ఞానాంబ. చేయి తీసేసి తనకు ముద్ద పెట్టకుండా తింటుంది జ్ఞానాంబ.
అమ్మా ఎప్పుడూ నీ ప్లేట్ లోనుంచి తీసుకొని తింటా కదా. పైగా నువ్వే తినిపించేదానివి.. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం పెడుతున్నావు అంటాడు రామా. పెట్టమ్మా అంటాడు. కానీ.. జ్ఞానాంబ తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన ప్లేట్ ను కూడా తీసుకొని వెళ్లిపోతుంది. దీంతో రామా చాలా బాధపడతాడు.
Janaki Kalaganaledu 26 Oct Today Episode : రామాతో కాళ్లు పట్టించుకోని జ్ఞానాంబ
మరోవైపు మల్లిక తెగ సంతోషంగా ఉంటుంది. తల్లీకొడుకులు మాట్లాడుకోకపోయేసరికి ఫుల్ ఖుషీలో ఉంటుంది. ఇంటి వెనుక ఫుల్ గా డ్యాన్స్ లు చేస్తూ ఉంటుంది. విష్ణు చూసి షాక్ అవుతాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మల్లిక చెబుతుంది.
కట్ చేస్తే జ్ఞానాంబ పడుకుంటుంది. రామా అని పిలుస్తుంది. తను మరిచిపోయి రామా అని పిలుస్తుంది. రోజూ రామా తన కాళ్లు పడతాడు కదా.. అలాగే ఈరోజు కూడా మరిచిపోయి రామా అని పిలుస్తుంది. తర్వాత తనకు తానే బాధపడుతుంది. తను పడుకున్నాక రామా వచ్చి కూర్చొని తన కాళ్లు పడతాడు. వెంటనే లేచి కాళ్లు జరుపుతుంది జ్ఞానాంబ. ఏమండి.. ఈరోజు నుంచి నాకు కాళ్లు పట్టడానికి నా కొడుకు లేడు. ఇలా రావద్దని చెప్పండి అంటుంది జ్ఞానాంబ. నీకోపాన్ని నేను భరించగలను కానీ.. మౌనాన్ని భరించే శక్తి నాకు లేదు. మా అమ్మతో నేను మాట్లాడకుండా ఉండటం అంటే ప్రాణం లేని జీవచ్ఛవాన్ని అంటాడు రామా. అమ్మ.. కనీసం వెళ్లరా రామా అని నాతో అయినా చెప్పమ్మా. మా అమ్మ నాతో ఇదైనా మాట్లాడింది అనుకుంటాను. నువ్వు నా మొహం చూడటానికి కూడా అసహ్యించుకుంటుంటే ఈ బాధను భరించే కంటే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అమ్మ.. అంటాడు. దీంతో ఇప్పటికే బాధను భరించేకపోతున్నా. ఇంకా ఇంకా బాధపెట్టొద్దని చెప్పండి.. అంటుంది జ్ఞానాంబ. వద్దురా.. రాముడు వద్దు వెళ్లరా అంటాడు గోవిందరాజు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.