Janaki Kalaganaledu 27 Sep Tomorrow Episode Highlights : జ్ఞానాంబ కోసం తన ఐపీఎస్ కలను జానకి చెరిపేసుకుంటుందా? జ్ఞానాంబకు వారసుడిని కని ఇస్తుందా? జానకి కలను రామా కూడా కలగానే మిగుల్చుతాడా?
Janaki Kalaganaledu 27 Sep Tomorrow Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 27 సెప్టెంబర్, 2021 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
ఎలాగోలా.. తన బ్రేస్ లెట్ ను కుదువ పెట్టి డబ్బులు సమకూర్చుతాడు రామా. దీంతో జానకిని తీసుకొని రాజమండ్రి వెళ్తాడు. జానకి కేకులు నేర్చుకోవడానికి వెళ్తుందంటూ జ్ఞానాంబ, తన తండ్రికి అబద్ధం చెబుతాడు రామా. వెళ్లేటప్పుడు జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకొమ్మని జానకికి చెబుతాడు.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
ఇవన్నీ చూసి మల్లికకు డౌట్ వస్తుంది. ఏంటి జానకి.. కొంపదీసి ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోసం వెళ్తున్నావా? ఏంటి.. అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రామా, జానకి షాక్ అవుతారు. ఏంటి మల్లిక అలా మాట్లాడుతున్నావు. నేను కేకులు నేర్చుకోవడానికి వెళ్తున్నా.. అని చెబుతుంది జానకి.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
తర్వాత ఇన్ స్టిట్యూట్ కు వెళ్లి ఫీజు కట్టేస్తుంది జానకి. తిరుగు ప్రయాణంతో రామా.. తనకు ఇష్టమైన చింత చెట్టు దగ్గర ఆపి.. చింతకాయలు కొట్టి జానకికి తినిపిస్తాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది జానకి. ఫీజు కట్టేశాం. ఇక నువ్వు ఎంత త్వరగా ఐపీఎస్ అయితే.. నాకు చూడాలని ఉంది అని చెబుతాడు రామా. అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకొని ఇంటికి వస్తారు జానకి, రామా.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
Janaki Kalaganaledu 27 Sep Tomorrow Episode Highlights : జానకి చేతుల్లో ఉన్న చింతకాయలను చూసి జానకి ప్రెగ్నెంట్ అని అనుకున్న జ్ఞానాంబ
జానకి చేతుల్లో ఉన్న చింతకాయలను చూసిన జ్ఞానాంబ.. ఏంటి జానకి గుడ్ న్యూసా.. నాకు చెప్పనేలేదు.. అంటూ తెగ సంబురపడిపోతుంది. దీంతో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాదు. నాకు చెప్పలేదు. ఇంత మంచి విషయాన్ని నాదగ్గర ఎందుకు దాచారు.. అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఏం చెప్పాలో వాళ్లకు అర్థం కాదు.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లిన జానకి… చాలా బాధపడుతుంది. అత్తయ్యను చాలా బాధపెడుతున్నా అని అనుకుంటుంది. అత్తయ్యకు అబద్ధం చెప్పి సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడమే కాకుండా.. అత్తయ్యకు కనీసం ఒక వారసుడిని కూడా ఇప్పటి వరకు కని ఇవ్వలేకపోయానని తెగ బాధపడుతుంది.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
అందుకే.. ఒక నిర్ణయానికి వస్తుంది జానకి. జ్ఞానాంబకు వారసుడిని కని ఇవ్వాలని అనుకుంటుంది. ఆరోజు రాత్రి మంచిగా రెడీ అవుతుంది. మల్లెపూలు పెట్టుకొని.. చేతులకు గాజులు వేసుకొని చక్కగా, అందంగా, ముస్తాబయిన జానకిని చూసి రామా.. తన బుగ్గకు దిష్టిచుక్క పెడతాడు. ఇంత అందంగా ఉన్నావు.. నీకు దిష్టి తాకుతుంది అంటాడు రామా.

janaki kalaganaledu 27 september 2021 monday latest episode 136 highlights
ఏమండి.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అత్తయ్య గారికి వారసుడిని కని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.. అని చెబుతుంది జానకి. దీంతో రామా తెగ సిగ్గుపడిపోతాడు. కానీ.. ఇంత సడెన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతాడు రామా. నువ్వు బిడ్డను కనాలంటే.. ఐపీఎస్ మీద దృష్టి పెట్టలేవు కదా.. అని అడుగుతాడు. ఏది ఏమైనా.. అత్తయ్యకు మాత్రం వారసుడిని కని ఇవ్వాలని డిసైడ్ అయ్యా అని చెబుతుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వారసుడిని కని ఇవ్వడానికి రామా కూడా ఒప్పుకుంటాడా? అనే విషయం తెలియాలంటే.. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.