Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జానకే నాకు తగ్గ కోడలు.. అని అన్న జ్ఞానాంబ.. మల్లిక షాక్.. జానకిని బ్యాడ్ చేసేందుకు మల్లిక మరో ప్లాన్
Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. శని, ఆదివారాల్లో ఈ సీరియల్ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 29 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 180 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేవలం జ్ఞానాంబకు ఇచ్చిన మాట కోసం జానకి.. తన ఐపీఎస్ కలను వదిలేసుకుంది. దీంతో శుక్రవారం ఎపిసోడ్ లో తన ఐపీఎస్ పుస్తకాలను అమ్మేస్తుంది. దీంతో చాలా బాధపడుతుంది జానకి. ఇక.. తనకు, ఐపీఎస్ తో సంబంధం లేదని.. జ్ఞానాంబకు ఇచ్చిన మాటను ఇక తప్పకూడదని అనుకుంటుంది జానకి.
janaki kalaganaledu 29 november 2021 episode highlights
మరోవైపు జానకి ఖార్ఖానాకు నెయ్యి తీసుకొని వెళ్తుంది. అక్కడ పూతరేకుల కోసం నెయ్యి అయిపోతే తను తీసుకెళ్లి ఇచ్చి వస్తుంది. అయితే.. ఆ నెయ్యిలో మల్లిక వాంతులు చేసుకునే మందును కలుపుతుంది. దాన్ని జానకి మీదకు నెట్టేయాలని అనుకుంటుంది మల్లిక. మరోవైపు రామా.. చాలా బాధపడతాడు. జానకి తన కోసం, తన కుటుంబం కోసం ఐపీఎస్ కలను వదిలేసుకుందని తెగ టెన్షన్ పడతాడు. రామా బాధపడటం చూసి.. జానకి కూడా బాధపడుతుంది. జానకి గారు మీరు దిగులుగా ఉన్న విషయం మీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంటాడు రామా.
నేనెందుకు దిగులుగా ఉంటాను అంటుంది జానకి. మీరు చదువుకున్న విషయం మరిచిపోవాలని.. భవిష్యత్తులో చదువుకు సంబంధించిన విషయం గురించి మాట్లాడకూడదని అమ్మ మీదగ్గర మాట తీసుకుంది. ఆ విషయం గురించే కదా మీరు బాధపడుతోంది అంటాడు రామా.
అత్తయ్య గారికి ఇచ్చిన మాట మీద గౌరవంతో నడుచుకుంటున్నాను. నా మనసులో చదువుకు సంబంధించిన బాధ అస్సలే లేదు అంటుంది జానకి. మీరు మీ మనసులో ఎంత బాధను అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను అంటాడు రామా. ఐపీఎస్ గురించి ఎన్ని కలలు కన్నారో నాకు తెలుసు. మీ బాధ లేదు అంటే ఎలా నమ్ముతాను.. అంటాడు రామా.
Janaki Kalaganaledu 29 Nov Episode Highlights : జ్ఞానాంబకు సారీ చెప్పానని చెప్పండి అని రామాతో అన్న శ్రావణి
మరోవైపు కొట్టుకు శ్రావణి వచ్చి.. నేను ఆరోజు అలా మాట్లాడటం తప్పే అని రామాతో అంటుంది. జ్ఞానాంబ గారి నేను క్షమాపణలు చెప్పానని చెప్పండి అంటుంది శ్రావణి. కానీ.. జానకి తన ఐపీఎస్ కలను వదిలేసుకోవడం అంటే తన ప్రాణాలను తీసుకోవడమే అంటుంది శ్రావణి.
మరోవైపు జానకి, జ్ఞానాంబ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే పక్కింటామె వస్తుంది. నీ కొడుకుకు చదువుకోని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు కదా జ్ఞానాంబ. మరి ఇప్పుడు ఏమైంది. చదువుకున్న కోడలును తెచ్చుకున్నావు.
చివరకు తను చేసిన తప్పును ఒప్పుకొని తనను క్షమించేశావా? అసలు నువ్వు తనను ఎలా క్షమిస్తావు. అంత మోసం చేసిన జానకిని నువ్వు క్షమిస్తావా? అంటూ ప్రశ్నిస్తుంది ఆమె. నువ్వు ప్రాణం పోయినా క్షమించకూడదు అంటుంది పక్కింటామె.
దీంతో.. చాలామంది ఆడపిల్లలకు కాస్త చదువు ఉంటే అహం, కొంచెం అందంగా ఉంటే పొగరు ఉంటాయి. కానీ.. నా కోడలు మాత్రం అటు చదువు ఇటు అందం రెండూ ఉన్నా సరే.. అణుకువకు పెట్టింది పేరు అంటుంది జ్ఞానాంబ. తర్వాత జానకి దగ్గరికి వెళ్లిన జ్ఞానాంబ.. ఈ జానకి.. ఈ జ్ఞానాంబకు తగ్గ కోడలు అంటుంది. దీంతో మల్లికతో పాటు.. పక్కింటామె కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.