Janaki Kalaganaledu 3 Feb Today Episode : పెద్ద బాంబు పేల్చిన జానకి.. నేను ఐపీఎస్ చదవను అని రామాకు చెప్పిన జానకి.. దీంతో జానకికి దూరం అయిన రామా.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 3 Feb Today Episode : పెద్ద బాంబు పేల్చిన జానకి.. నేను ఐపీఎస్ చదవను అని రామాకు చెప్పిన జానకి.. దీంతో జానకికి దూరం అయిన రామా.. ఇంతలో మరో ట్విస్ట్

Janaki Kalaganaledu 3 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఫిబ్రవరి 3, 2022 గురువారం ఎపిసోడ్ 229 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక నుంచి చదువు గురించే ఆలోచించొద్దు. నాకే చదువుకోవడం ఇష్టం లేదు అని నువ్వే రామాకు చెప్పు అని జ్ఞానాంబ‌.. జానకికి చెప్పిన విషయం తెలిసిందే. నువ్వు వెంటనే చదువుకున్న కాగితాలు అన్నింటినీ నాకు తెచ్చి ఇచ్చేయ్ అని చెబుతుంది జ్ఞానాంబ‌. […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 February 2022,10:31 am

Janaki Kalaganaledu 3 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఫిబ్రవరి 3, 2022 గురువారం ఎపిసోడ్ 229 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక నుంచి చదువు గురించే ఆలోచించొద్దు. నాకే చదువుకోవడం ఇష్టం లేదు అని నువ్వే రామాకు చెప్పు అని జ్ఞానాంబ‌.. జానకికి చెప్పిన విషయం తెలిసిందే. నువ్వు వెంటనే చదువుకున్న కాగితాలు అన్నింటినీ నాకు తెచ్చి ఇచ్చేయ్ అని చెబుతుంది జ్ఞానాంబ‌. దీంతో తన రూమ్ లోకి వెళ్లి వాటిని తీసుకొని రామా దగ్గరికి వెళ్లి మీ ఆశను బతికించలేకపోతున్నందుకు క్షమించండి అని రామా కాళ్లకు మొక్కి అక్కడి నుంచి సర్టిఫికెట్లు తీసుకొని జ్ఞానాంబ‌ దగ్గరికి వెళ్తుంది జానకి. ఇంతలో రామాకు మెళకువ వస్తుంది. జానకి గారు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటాడు రామా.

janaki kalaganaledu 3 february 2022 full episode

janaki kalaganaledu 3 february 2022 full episode

వెంటనే బయటికి వచ్చి చూస్తాడు. ఇంతలో జానకి తన సర్టిఫికెట్లు తీసుకొచ్చి జ్ఞానాంబ‌కు ఇస్తుంది. జ్ఞానాంబ‌ వాటిని తీసుకుంటుంది. జానకి నా కొడుకంటే నాకు ప్రాణం. వాడికి ఏదైనా అయితే ఈ అమ్మ తట్టుకొని బతకలేదు. నా కొడుకు క్షేమం కోసం నా కొడుకు బాగుండటం కోసం నేను కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తాను అంటుంది జ్ఞానాంబ‌. మరోవైపు జానకి గారు అంటూ ఇల్లంతా వెతుకుతుంటాడు రామా. అది ఎదుటివాళ్లకు ఇబ్బంది కల్గించినా అందులో నా తప్పు ఏం ఉండదని నాకు తెలుసు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అంటుంది జ్ఞానాంబ‌. అత్తయ్య గారు.. మీ ప్రేమ మంచితనం తెలుసు కాబట్టి.. అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు అడగ్గానే నా సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చాను అంటుంది. ఇంతలో రామా అక్కడికి వచ్చి అమ్మ అంటాడు.

దీంతో జానకి, జ్ఞానాంబ‌ ఇద్దరూ షాక్ అవుతారు. ఏమైంది అమ్మ అంటాడు రామా. ఈ టైమ్ లో ఏ విషయం గురించి మీరు ఇంత తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు అంటాడు రామా. జానకి గారు మీరైనా చెప్పండి. మీరు అమ్మతో మాట్లాడటానికి వస్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అంటాడు రామా.

చెప్పండి జానకి గారు ఏమైంది అని అడుగుతాడు. నన్ను ఐపీఎస్ చదవమని ఎస్ఐ గారు అడిగారు. ఆ విషయంలో నా అభిప్రాయం అడగడానికి అత్తయ్య గారు పిలిచారు. చదువు గురించి నా నిర్ణయం ఏంటో చెప్పమన్నారు అంటుంది జానకి. దీంతో ఈ విషయంలో మన నిర్ణయం కంటే అమ్మ నిర్ణయమే ముఖ్యం కదా జానకి గారు అంటాడు రామా.

అవునండి.. అత్తయ్య గారి నిర్ణయమే ఫైనల్ అంటుంది జానకి. అమ్మ.. జానకి గారి ఐపీఎస్ గురించి నేను ఉదయమే నేను మాట్లాడాను కదా.. అని అడుగుతాడు రామా. దీంతో నేను ఐపీఎస్ చదవడం అత్తయ్య గారికి ఇష్టమే అంటుంది జానకి. దీంతో రామా చాలా సంతోషిస్తాడు. అమ్మ ఒప్పుకుందా అంటాడు రామా.

Janaki Kalaganaledu 3 Feb Today Episode : అత్తయ్య గారు నా చదువు కోసం ఒప్పుకున్నారు అని రామాకు చెప్పిన జానకి

అమ్మ.. నాకు తెలుసు అమ్మ.. పిల్లల ఇష్టాలను నువ్వు గొప్పగా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. జానకి గారు చదువుకోవడానికి నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావని నాకు తెలుసు అమ్మ. కానీ.. ఎక్కడో ఒక మూల నాకు భయం అమ్మ.. అంటాడు.

కానీ.. నాకు చదువుకోవడం ఇష్టం లేదు అంటుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. జానకి గారు ఏం మాట్లాడుతున్నారు. మీకు చదువుకోవడం ఇష్టం లేకపోవడం ఏంటండి అంటాడు. అవును రామా గారు.. అత్తయ్య గారు ఒప్పుకున్నా సరే.. నేను చదువుకోవడానికి ఇష్టంగా లేను అంటుంది జానకి.

దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా అభిప్రాయాన్ని గౌరవించండి అంటుంది జానకి. అది కాదు జానకి గారు అని చెప్పినా కూడా వినకుండా ప్లీజ్ అంటూ రామాకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి. ఇంతలో రామా తన దగ్గరికి వస్తాడు. ఏమైంది.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నిస్తాడు రామా.

ఇంతలోనే ఏమైంది.. నిన్నటి వరకు శ్రద్ధగా చదువుకున్నారు కదా. మళ్లీ ఇప్పుడు ఐపీఎస్ కలను వదిలేసుకోవడం ఏంటి.. అని ప్రశ్నిస్తాడు రామా. దీంతో చెప్పాను కదా రామా గారు నాకు చదువుకోవడం ఇష్టం లేదు అంటుంది జానకి. అబద్ధం చెప్పడానికి ధైర్యం కావాలి. అదే మాటను నా కళ్లలోకి చూసి చెప్పండి అంటాడు రామా.

ఇష్టం లేదనుకోవడానికి చిన్నచిన్న కారణాలు ఉంటాయి. కానీ.. వద్దనుకోవాలంటే బలమైన కారణాలు ఉంటాయి. చిన్నప్పటి కల ఐపీఎస్. ఇప్పుడు మీరు ఆ కలను వదిలేశారంటే మీ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏదో నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా.

ఉదయమే పూజారిని పిలుస్తుంది జ్ఞానాంబ‌. ఈ ఇంట్లో చాలా అపశకునాలు జరుగుతున్నాయని పూజారికి చెబుతుంది. బస్సు ప్రమాదం, బాంబు ప్రమాదం నుంచి నా కొడుకు, కోడలు తృటిలో తప్పించుకున్నారు. అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి అని చెబుతుంది జ్ఞానాంబ‌.

దానికి ఏదైనా పరిహారం కానీ.. పరిష్కారం కానీ ఉంటే చెప్పండి పూజారి గారు అని చెబుతుంది. దీంతో ఈ సంవత్సరం మీ కుల దేవతకు మొక్కు చెల్లించుకున్నారా అని అడుగుతాడు. దీంతో లేదండి అంటుంది. మీ పెద్ద కొడుకు, కోడలుతో ఉన్నపళంగా కులదేవత ఆరాదన చేయించండి.. అంటాడు పూజారి. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ‌.

పంచాంగం చూసి రేపే ఆ పూజ జరిపించండి అని చెబుతాడు పూజారి. వెంటనే రామా, జానకి.. ఇద్దరినీ కుల దేవత గుడికి వెళ్లమని చెబుతుంది. దీంతో అత్తయ్య గారు మేము కూడా వెళ్తాం అని అడుగుతుంది మల్లిక. దీంతో పూజారి గారు వెళ్లమన్నది రామా, జానకిని. మీరు మరోసారి వెళ్లండి అంటుంది జ్ఞానాంబ‌.

మరోవైపు ఇద్దరూ రామా.. జానకితో మాట్లాడటం మానేస్తాడు. తను ఐపీఎస్ కలను వదిలేసుకున్నందుకు.. కుల దేవత దగ్గరికి వెళ్లేటప్పుడు వేరే బ్యాగు సర్దుకుంటాడు. మొత్తానికి జానకి ఐపీఎస్ కల.. రామా, జానకిని విడదీసింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది