Janaki Kalaganaledu 4 Oct Today Episode : తన ఐపీఎస్ కలను వదిలేసుకొని పుస్తకాలను కాల్చేసిన జానకి.. అంత పని చేస్తావా? అని రామా సీరియస్?
Janaki Kalaganaledu 4 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 4 అక్టోబర్ 2021, సోమవారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 141 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

janaki kalaganaledu 4 october 2021 full episode
మల్లిక, విష్ణును ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ జ్ఞానాంబ ఆర్డర్ వేస్తుంది. అయితే.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మనగానే… సంతోషపడిన మల్లిక.. ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్లాలని జ్ఞానాంబ చెప్పడంతో షాక్ అవుతుంది. వెంటనే ప్లేట్ ఫిరాయిస్తుంది. అత్తయ్య గారు ఎక్కడికి అత్తయ్య గారు వెళ్లేది.. అంటూ అడుగుతుంది. ఆయన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే తల్లీకొడుకులను విడదీసిన పాపం నాకెందుకు.. అని తన భర్తను తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది మల్లిక.
ఇక.. జానకి తన రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన అత్తయ్యను మోసం చేయడం కరెక్ట్ కాదని అనుకుంటుంది. తనకు చదువుకోలేదని అబద్ధం చెప్పి ఇంత పెద్ద మోసం చేయడం కరెక్ట్ కాదని అనుకుంటుంది జానకి. అత్తయ్య తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేస్తున్నా అని అనుకుంటుంది. వెంటనే తన ఐపీఎస్ పుస్తకాలను తీసుకొని పడుకొని ఉన్న తన భర్త దగ్గరికి వస్తుంది జానకి.
Janaki Kalaganaledu 4 Oct Today Episode : తన పుస్తకాలను కాల్చేసిన జానకి
తన భర్త చేతిని తీసుకొని ముద్దాడి.. నేను ఐపీఎస్ అవడానికి కల మాత్రమే కన్నాను. కానీ… ఆ కలను నిజం చేయడానికి మీరు ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నారు.. అత్తయ్య గారి ముందు నిజం దాస్తూ బతకడం ఇక నావల్ల కాదు. అందుకే.. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఆ కల కంటే ఈ కుటుంబమే ముఖ్యం. దానికి మీరు నన్ను క్షమించాలి.. అని అనుకుంటుంది జానకి.

janaki kalaganaledu 4 october 2021 full episode
వెంటనే ఆ పుస్తకాలను తీసుకొని బయటికి వెళ్లి కింద పడేసి.. అగ్గిపెట్టెతో నిప్పంటిస్తుంది. అక్కడే కూర్చొని అవి కాలిపోతుంటే చూసి ఏడుస్తూ ఉంటుంది జానకి. ఇంతలో రామా నిద్రలేచి.. జానకివైపు చూస్తాడు. జానకి రూమ్ లో ఉండదు. ఎక్కడికి వెళ్లిందోనని బయటికి వచ్చి చూస్తాడు. బయట జానకి పుస్తకాలను కాల్చడం చూసి షాక్ అవుతాడు. అయ్యో జానకి గారు పుస్తకాలు కాలిపోతున్నాయండి.. అంటాడు.
దీంతో ఆగండి.. అంటుంది. అవి బూడిద అవ్వనీయండి.. అంటుంది జానకి. అంటే.. వాటిని అని రామా అనగానే.. నేనే కాల్చేశాను అంటుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు.

janaki kalaganaledu 4 october 2021 full episode
అసలు మీరు ఏం చేస్తున్నారు.. ఏంటిది.. అంటూ రామా సీరియస్ అవుతాడు. దీంతో ఇప్పుడు నేను ఐపీఎస్ అవడం కంటే అత్తయ్య గారి దృష్టిలో మంచి కోడలు అనిపించుకోవడం నా బాధ్యత. అందుకే.. పుస్తకాలతో పాటు నా ఐపీఎస్ కలను కూడా మంటల్లో కలిపేశాను అంటుంది జానకి.
మీరు ఇప్పటికే మంచి కోడలు అండి. ఇంకా మంచి కోడలు అనిపించుకోవడం ఏంటి అంటాడు రామా. మల్లిక లాగానే నేను కూడా నా భర్తకు దూరంగా ఉండి పిల్లలను కనకుండా అత్తయ్యను మోసం చేస్తున్నాను.. అని జానకి అనగానే.. మల్లికతో మిమ్మల్ని పోల్చుకోకండి. ఒక కల కోసం 2 సంవత్సరాలు పిల్లలను కనకుండా ఉండటం తప్పేమీ కాదు అంటాడు రామా.

janaki kalaganaledu 4 october 2021 full episode
లేదండి.. నేను అస్సలు ఇక అత్తయ్య గారిని మోసం చేయలేను. అత్తయ్య నమ్మకాన్ని వమ్ము చేయలేను అంటుంది జానకి. మీరు ఏం భయపడకండి.. మీకు నేనున్నాను.. మీకేం కాదు.. అమ్మకు అన్నీ తర్వాత చెప్పొచ్చు.. అని చెప్పి జానకిని ఓదార్చుతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.