Janaki Kalaganaledu 7 Oct Today Episode : జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ.. మల్లిక కూడా ఫోన్ చేసి జానకి చదువు గురించి జ్ఞానాంబకు చెప్పడంతో జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుంది?
Janaki Kalaganaledu 7 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 7 అక్టోబర్ 2021, గురువారం ఎపిసోడ్ 144 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.ఉదయం లేవగానే మాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు అంటూ అందరూ వచ్చి జానకిని టెన్షన్ పెడతారు. మాకు తెలిసినా ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటూ జ్ఞానాంబ అడుగుతుంది. అత్తయ్య గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే.. ఇవాళ నీ పుట్టిన రోజు అని మాకు తెలిసిపోయింది.. అని సర్ ప్రైజ్ చేస్తుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 7 october 2021 latest episode
ఈరోజు నీ పుట్టిన రోజు అనే విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు.. అని అడుగుతారు. చిన్న విషయమే కదా అని చెప్పలేదు అని అంటుంది జానకి. ఏంటి చిన్న విషయం.. నీ పుట్టిన రోజును మీ అమ్మానాన్నలే చేయాలా.. మేము చేయొద్దా.. అని అడుగుతుంది జ్ఞానాంబ. సాయంత్రం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం అని అంటుంది జ్ఞానాంబ.రామా, జానకికి కొత్త బట్టలు తీసుకొస్తుంది జ్ఞానాంబ. ఈరోజు తనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. తనను సాయంత్రం వరకు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లు. సాయంత్రం వరకు సరదాగా గడిపేయండి అని అంటుంది జ్ఞానాంబ.ఇంతలో జానకి అన్నయ్య ఫోన్ చేస్తాడు. వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్ డే జాను అని చెబుతాడు. జాను.. నీ పుట్టిన రోజు హ్యాపీనెస్ అంతా నీ ముఖంలో వెలిగిపోతోంది తెలుసా.. అంటుంది జానకి వదిన. మీకు ఇంకో సర్ ప్రైజ్ జాను.. దసరాకు మేము ఇండియాకు వస్తున్నాం అంటాడు తన అన్నయ్య. నిజమా.. అని ఆశ్చర్యపోతుంది జానకి.

janaki kalaganaledu 7 october 2021 latest episode
Janaki Kalaganaledu 7 Oct Today Episode : ఈరోజు ఏదో కీడు జరగబోతోందని గ్రహించిన జానకి
తన అత్తయ్యకు అబద్ధం చెప్పినందుకు ఏం చేయాలో అర్థ కాక దేవుడికి మొక్కుకుంటుంది జానకి. దీపం వెలిగించగానే దీపం ఆరిపోతుంది. మరోవైపు జ్ఞానాంబ.. కాలేజీకి వెళ్తుంది. ప్రిన్సిపల్ రూమ్ కు వెళ్తుంది. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నారు కదా.. దాని గురించి చెప్పండి అని అంటుంది. గతంలో మీరు పేద విద్యార్థుల కోసం చేసిన సేవ చాలా గొప్పది. మీరు సాయం చేయడం వల్లనే చాలామంది పిల్లలు చదువుకున్నారు. కొందరు టాప్ ర్యాంకులో పాస్ అయ్యారు. అలాగే మరో అమ్మాయి కూడా సివిల్స్ లో ర్యాంకు సాధించింది అని చెబుతాడు ప్రిన్సిపల్. ఆ అమ్మాయి మీ ఊళ్లోనే ఉందట అని చెబుతాడు. ఆ అమ్మాయి జానకియే అని జ్ఞానాంబ తెలుసుకోలేకపోతుంది. తనకు ఫోన్ రాగానే వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 7 october 2021 latest episode
కట్ చేస్తే.. జానకి, రామా ఇద్దరూ బైక్ పై వెళ్తుంటారు. బండి పంచర్ అవుతుంది. మరోవైపు ఫోన్ మాట్లాడి.. మళ్లీ ప్రిన్సిపల్ రూమ్ కు వెళ్తుంది జ్ఞానాంబ. అక్కడ జానకి ఫోటోను చూసి షాక్ అవుతుంది. జానకి ఫోటో ఇక్కడ ఉందేంటి అని చూస్తుంది. ఆ ఫోటోను చూపించిన ప్రిన్సిపల్.. తను ఇప్పుడు మీ ఊరులోనే ఉంటుంది.. అని చెబుతాడు. ఆ అమ్మాయి పేరు జానకి.. ఇంటర్మీడియెట్ లో టాపర్ తను అని చెబుతాడు ప్రిన్సిపల్. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి.వెంటనే జ్ఞానాంబకు మల్లిక ఫోన్ చేసి.. జానకి చదువు విషయం చెబుతుంది. జానకి సర్టిఫికెట్లు చూసి షాక్ అవుతుంది. జానకి చదువుకుంది 5వ తరగతి కాదు డిగ్రీ అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.