Janhvi Kapoor : జాన్వీ కపూర్ మాముల్ది కాదు .. ప్లాన్ ప్రకారమే ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 March 2023,3:00 pm

Janhvi Kapoor : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇటీవల నందమూరి తారకరత్న మరణించారు. ఈ కారణం వలన కూడా ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాను గ్రాండ్గా లాంచ్ చేయడానికి తారక్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు కొరటాల.

Janhvi Kapoor entry with ntr in tollywood because of that reason

Janhvi Kapoor entry with ntr in tollywood because of that reason

ఈ లుక్ లో జాన్వీ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ కొద్దిగా హాట్ నెస్ గా కనిపించింది. లంగా ఓణిలో కనిపిస్తూనే నడుమ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ జావ్వీ ఈ సినిమాకి హైలైట్ లుక్ ని ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే జాన్వి కపూర్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించడానికి ఆమెకు అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్ , అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది స్టార్ సినిమాలో అవకాశం వచ్చిన అవన్నీ రిజెక్ట్ చేసింది కానీ ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం జాన్వికపూర్ కావాలనే ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి ఇన్నాళ్లు వెయిట్ చేసిందని అంటున్నారు.

Janhvi Kapoor Telugu Debut opposite Jr NTR in Koratala Siva Film | TOT News  Telugu - YouTube

తన తల్లి శ్రీదేవికి సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. అలాంటి రికార్డుని సెట్ చేయడానికి ఎన్టీఆర్ తో జాన్వి కపూర్ జతకట్టబోతుందని , అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ ఎలా హిట్ అయిందో ఇప్పుడు ఎన్టీఆర్ జాన్వి కపూర్ కాంబో హిట్ అవ్వాలని జాన్వి ప్లాన్ చేసుకుందని తెలుస్తుంది. మొత్తానికి టాలీవుడ్లోకి జాన్వి కపూర్ ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాతో ఆమెకు ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. తన తల్లి శ్రీదేవి రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి