Janhvi Kapoor : నా ఫోన్ చూపించ‌ను కాని నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ ప‌క్కా చేస్తానంటూ జాన్వీ కామెంట్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : నా ఫోన్ చూపించ‌ను కాని నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ ప‌క్కా చేస్తానంటూ జాన్వీ కామెంట్స్..!!

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2024,1:00 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది .ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది. ఈ సినిమాతో జాన్వీకి మంచి పేరు వ‌స్తుంద‌ని అంటున్నారు.

Janhvi Kapoor : భ‌లే ఇరికించేసిందిగా..

ఇక జాన్వీ క‌పూర్ త‌న ప్రేమాయ‌ణంతో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. అక్షత్ రాజన్, ఓరి అవత్రమణి, శిఖర్ పహారియా… జాన్వీ కపూర్ లవర్స్ అంటూ నెట్టింట ప‌లు ప్ర‌చారాలు సాగుతుంటాయి. వారితో జాన్వీ కపూర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు చక్కర్లు కొట్టాయి. తాజాగా జాన్వీ కపూర్ కి ఒక క్రేజీ ప్రశ్న ఎదురైంది. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ ని కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు ప్రశ్నలు అడిగారు. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేయవచ్చా?అని జాన్వీ కపూర్ ని ఓ అమ్మాయి అడిగింది. అవును బాయ్ ఫ్రెండ్ ఫోన్ అమ్మాయిలు చెక్ చేయవచ్చు. నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. అందులో తప్పు లేదు అన్నది. మరి అమ్మాయి ఫోన్ తన బాయ్ ఫ్రెండ్ చెక్ చేయవచ్చా?

అని అడగ్గా… చేయకూడదు అని సమాధానం చెప్పింది జాన్వీ. అదేంటి అమ్మాయి ఫోన్ అబ్బాయి చెక్ చేయకూడదు, అబ్బాయి ఫోన్ అమ్మాయి చెక్ చేయవచ్చా? ఇదేం న్యాయం అని అడగ్గా… అమ్మాయిల మీద మీకు నమ్మకం లేదా అని జాన్వీ నవ్వుతూ సమాధానం చెప్పింది. జాన్వీ కపూర్ వీడియో వైరల్ అవుతుంది. ఇక దేవర చిత్రంలో తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పిన జాన్వీ.. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ అంతా సరదాగా సాగిపోయిందని తెలిపింది. మూవీ టీమ్ అంతా తనపై ఎంతో ప్రేమ చూపించారని చెప్పింది. దేవర చాలా విభిన్నమైన సినిమా అని చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది