Janhvi Kapoor : విజయ్ దేవరకొండతో డేటింగ్‌కు ఓకే.. కానీ లైగర్ మూవీకి నో చెప్పిన జాన్వీ కపూర్.. ఎందుకో తెలుసా?

 Authored By mallesh | The Telugu News | Updated on :29 August 2022,12:20 pm

Janhvi Kapoor : బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం అక్కడ తన పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. తన అందచందాలతో ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ .. తాను చేయబోయే సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోందని టాక్ వినిపిస్తోంది. జాన్వీ ఇప్పటికే రెండు నుంచి మూడు సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది. అందులో మరాఠీ మూవీ సైరాట్ రీమేక్ ధడక్.. రూహీ, గుంజన్ సక్సెనా, గుడ్ లక్ జెర్రీ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో గుంజన్ సక్సెనా మినహా ఏది పెద్దగా జాన్వీకి పెద్దగా పేరును తీసుకురాలేదు.

Janhvi Kapoor : విజయ్ దేవరకొండతో డేటింగ్‌ నాకు ఓకే..

ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే లైగర్ మూవీ కథ విన్నప్పుడు పూరి జగన్నాథ్ మీద ఉన్ననమ్మకంతో విజయ్‌తో మూవీ చేయడానికి ఓకే చెప్పిన అది కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందని జాన్వీ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. తనకు డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్పించుకున్నట్టు సమాచారం. జాన్వీ నో చెప్పిన తర్వాత పూరి జగన్నాథ్ నిర్మాత కరణ్ జోహార్‌కు అదే విషయాన్ని చెప్పగా.. ఆయన సలహా మేరకు అనన్య పాండేను తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే, లైగర్ మూవీ చేసేందుకు నో చెప్పిన జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ షోలో విజయ్‌తో డేటింగ్ చేస్తానని నిర్మోహమాటం ప్రకటించింది.

Janhvi Kapoor to dating Vijay Devarakonda

Janhvi Kapoor to dating Vijay Devarakonda

ఈ భామే కాకుండా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా ఇదే విషయం చెప్పడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. విజయ్‌కు ఇంత లేడిస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని సోషల్ మీడియా కోడై కూసింది. లైగర్ మూవీకి నో చెప్పి జాన్వీ మంచి పనిచేసిందని ఆ సినిమా విడులయ్యాక కొందరు చెప్పారట.. ఎందుకంటే అనుకున్న అంచనాలను లైగర్ అందుకోలేకపోయింది. డిజాస్ట‌ర్‌గా నిలవడంతో అంతా విమర్శించారు.ఈ సినిమాలో నటించిన అనన్య పాండేకు కూడా ఇది మైనస్ అనే అంటున్నారు. కానీ పూరి డైరెక్షన్‌లో విజయ్ హీరోగా జనగనమన సినిమాలో నటించేందుక జాన్వీ ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి