Anchor suma : జయమ్మ పంచాయితీ మూవీ టీజర్.. రేపే రిలీజ్..
Anchor suma : యాంకర్ సుమ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు చాలా ఫేమస్. టీవీ ప్రేక్షకుల్లో సుమ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన మాటలతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. వాస్తవానికి ఆమె కేరళకు చెందిన మహిళే అయినా.. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడటం ఆమె స్పెషాలిటీ. యాంకరింగ్ రంగంలో ఆమె స్థానం ఎప్పుడూ సుస్థిరమనే చెప్పాలి. ఫ్యాన్స్ మొదలు స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ ఆమె యాంకరింగ్ కు ఫిదా కావాల్సిందే.
ఆమె మాటలు, పరిస్థితులకు అనుగుణంగా వేసే పంచులూ అందరినీ ఆకట్టుకుంటాయి. స్టార్ మహిళ, భలే చాన్సులే వంటి టీవీ ప్రోగ్రామ్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది సుమ. దేవదాస్ కనకాల డైరెక్టర్ చేసిన మేఘమాల సీరియల్‌లో సుమ యాక్ట్ చేస్తున్న సమయంలో సదురు డైరెక్టర్ కొడుకు రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

jayamma panchayiti movie teaser release tomorrow
Anchor suma : డిఫరెంట్ లుక్‌తో..
తాజాగా సుమ యాక్ట్ చేసిన మూవీ జయమ్మ పంచాయితీ. ఈ మూవీని బాలగ ప్రకాశ్ డైరెక్ట్ నిర్మిస్తుండగా.. విజయ్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండటం మరో విశేషం. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ఆదివారం ఉదయం 11.07 నిమిషాలకు దగ్గుబాటి రాణా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సదురు మూవీ యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఇక ఇందులో పల్లెటూరి మహిళ పాత్రలో సుమ యాక్ట్ చేసినట్టు టాక్.