Extraordinary Man Movie : ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత – రాజశేఖర్.. స్టేజ్ మీద రచ్చ రచ్చ చేశారుగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Extraordinary Man Movie : ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత – రాజశేఖర్.. స్టేజ్ మీద రచ్చ రచ్చ చేశారుగా..

 Authored By anusha | The Telugu News | Updated on :5 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Extraordinary Man Movie : ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ..

  •   జీవిత - రాజశేఖర్.. స్టేజ్ మీద రచ్చ రచ్చ చేశారుగా..

Extraordinary Man Movie : ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో నితిన్ శ్రీ లీల డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. నా పేరు సూర్య సినిమా తో ఫ్లాప్ అయిన వంశీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడిగా వంశీకి ఇది రెండో అవకాశం. ఈసారి ఫుల్ లెన్త్ ఎంటర్టైన్ మెంట్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో మొదటిసారిగా రాజశేఖర్ నటించారు. దీంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నాడు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ.. సినిమాలోని డైలాగ్ గురించి ప్రస్తావించారు. జీవిత జీవితం రెండు ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో అది బాగా క్లిక్ అయింది. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకోలేదు. ఈ డైలాగ్ స్పాట్ లోనే రాశారు. ఇక వంశీ గారు నాకు కథ చెప్పి కన్విన్స్ చేశారు. ఈ పాత్ర కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను అని, జీవితం చెప్తే నేను ఆడతాను అని అంతా అనుకుంటారు. కానీ నేను ఏం చెబితే జీవిత అలా ఆడుతుంది. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చాలా మంచిది మా అందరి గురించి బాగా ఆలోచిస్తుంది అని రాజశేఖర్ అన్నారు.

ఇక దర్శక నిర్మాతలకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని, హీరో నితిన్ బయట చూసి ఆకతాయి అనుకున్నా, సినిమాల్లో ఎక్కువగా ఆ పాత్రలే వేశాడు, బయట కూడా అలానే ఉంటారు అనుకున్నా, కానీ సెట్స్ లో హీరోగా, నిర్మాతగా చాలా బాధ్యతగా వ్యవహరించారు. నేను శ్రీలీల ఇద్దరం ఎంబీబీఎస్ చదివాం. కానీ శ్రీలీల ఒక కండిషన్ పపెట్టింది. ాక్టర్ చదువు గురించి ప్రశ్నలు వేయద్దు అని అన్నారు. అందుకే నేను వాటి గురించి ప్రస్తావించలేదు. ఇక ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. డిసెంబర్ 8న థియేటర్లలో విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది