Jr NTR : తెలుగు భాషతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. జూ. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపతున్నారు. ఓ మీడియాకు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో హీరో తారక్ కు ఎదురైన ప్రశ్నకు ఆయన నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ తారక్ కు ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చే అవకాశాలున్నాయా అనే ప్రశ్నపై ఎన్టీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలియదు కానీ తమ 2 కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోందంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికి రామ్ చరణ్, తాను మంచి స్నేహితులుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. తమ రెండు ఫ్యామిలీల మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుందన్న తారక్.. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తర్వాత దేశంలోని స్టార్లంతా ఒకే తాటి పైకి వస్తారని అన్నారు. తమ చిత్రం రిలీజ్ అనంతరం…
ముందు ముందు భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం తమకు ఉందని అన్నారు.గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వనున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను రాజమౌళి తనదైన శైలిలో జరుపుతున్నారు. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న రామ్ చరణ్, తారక్ లు నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ ఉంటే రాను రాను మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతూ పోయేలా కనిపిస్తోంది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.