Jr NTR : ఎన్టీఆర్‌ ని బలి పశువును చేస్తున్నాడంటూ రాజమౌళిపై ఫ్యాన్స్ ఆగ్రహం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : ఎన్టీఆర్‌ ని బలి పశువును చేస్తున్నాడంటూ రాజమౌళిపై ఫ్యాన్స్ ఆగ్రహం

 Authored By aruna | The Telugu News | Updated on :28 August 2022,9:40 pm

Jr NTR : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. హిందీలో ఈ సినిమాకు మంచి అంచనాలు ఉన్నాయి. కానీ తెలుగులో ఈ సినిమా ను రాజమౌళి సమర్పిస్తున్న కూడా పెద్దగా అంచనాలు ఉన్నట్లుగా అనిపించడం లేదు. ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎక్కువగా చర్చించుకోవడం కనిపించడం లేదు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలు విడుదలవుతున్న సమయంలో తెలుగులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, కానీ ఈ సినిమా డబ్బింగ్ సినిమా అవడం వల్ల పెద్దగా ఆసక్తిని చూపించడం లేదంటూ సమాచారం అందుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన పంపిణీ హక్కులు రాజమౌళి సమర్పిస్తున్న కారణంగా భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి, కానీ ఇప్పుడు సినిమాకు బజ్ క్రియేట్ కాని కారణంగా బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రాజమౌళి తన యొక్క మేధస్సును ఉపయోగించి సినిమా ప్రమోషన్ కి యంగ్ టైగర్ ని తీసుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఫ్లాప్ కాబోతున్న సినిమాకు ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హాజరు కావడం ఏంటి అంటూ కొందరు నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Jr NTR going to attend for bollywood movie brahmastra pre release event

Jr NTR going to attend for bollywood movie brahmastra pre release event

బ్రహ్మాస్త్ర సినిమా గ్రాఫిక్స్ విషయంలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. తెలుగులో ఈ సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ టాక్ ని దక్కించుకుంటుందంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఫ్లాప్ అవ్వబోతున్న సినిమాకు ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకు వెళ్లడం ద్వారా ఆయనను బలి పశువును చేయడమే అంటూ ఆయన అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి పై ఉన్న గౌరవంతో ఎన్టీఆర్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు తప్పితే ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ హాజరు అవ్వడం వల్ల సినిమా యొక్క ఫలితం ఏమైనా మారుతుందేమో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది