Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ కెరీర్ లో ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇది….!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ కెరీర్ లో ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇది….!!

 Authored By prabhas | The Telugu News | Updated on :23 December 2022,2:40 pm

Kaikala Satyanarayana : అప్పటి సినిమాల్లో కైకాల స్యనారాయణ అంటే ఎవరు తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరంలో గొప్ప నటుల్లో ఒకరు కైకాల సత్యనారాయణ. ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించారు. ఆయనకు 1960లో నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ సిపాయి ‘ . ఈ సినిమా 1959లో విడుదల అయింది. ఇక ఈరోజు ఉదయాన కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఈరోజు ఉదయానే తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో మృతి చెందారు. ఇండస్ట్రీలో ఆయనకు నటసార్వభౌముడిగా పేరు ఉంది. ఎన్నో పౌరాణిక సాంఘిక, జానపద చిత్రాలలో నటించారు. ఆయన కెరీర్లో మరో గొప్ప విశేషం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా కూడా నటించారు. ఇక కైకాల మొత్తం 777 సినిమాల్లో నటించారు. ఆయన ఆఖరిగా నటించిన సినిమా మహర్షి. ఇక కైకాల తన కెరియర్ లో 28 పౌరాణిక, 501 జానపద, 9 చారిత్రక సినిమాలలో నటించారు.

senior actor Kaikala Satyanarayana top secret in him life

senior actor Kaikala Satyanarayana top secret in him life

200కు పైగా దర్శకుల సినిమాలలో నటించారు. అలాగే ఆయన కెరీర్లో పదికి పైగా సినిమాలు 365 రోజులు ఆడాయి. 223 సినిమాలు వంద రోజులు ఆడాయి. యముడు, రావణుడు దుర్యోధనుడు లాంటి పాత్రలకు ఆయనకు పెట్టింది పేరు. కైకాల ఇంటర్ చదువుతున్న సమయంలో సినిమాలపై ఇంట్రస్ట్ ఉండడంతో మద్రాస్ వెళ్లారు. ఆయనలోని నటనను గుర్తించి డీల్ నారాయణ సినిమా అవకాశాలు ఇచ్చారు. ఇక 1996 లో మచిలీపట్నం నుంచిస టిడీపీ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది