shanmuk : ఎలినేషన్‌లో కాజల్.. చివరిసారిగా షణ్ముక్ గురించి ఏం చెప్పిందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

shanmuk : ఎలినేషన్‌లో కాజల్.. చివరిసారిగా షణ్ముక్ గురించి ఏం చెప్పిందంటే?

 Authored By mallesh | The Telugu News | Updated on :12 December 2021,3:40 pm

shanmuku : బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ ముగింపు దశకు చేరుకుంది. నేటితో బిగ్‌బాస్ విజయవంతగా 14 వారాలు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ -5లో ఇప్పుడు కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఈ రోజు కాజల్ ఎలిమినేషన్ డిక్లేర్ కావడంతో ఆమె బయటకు వెళ్లిపోవాల్సి ఉంది. ఇప్పటికే 98 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈ గేమ్ షో తుది అంకానికి చేరుకుంది. టాప్ -5లో సన్నీ, శ్రీరామచంద్ర, మానస్, షణ్ముక్, సిరి నిలిచారు. మొదటి నుంచి టాప్ -5లో ఉండాలని కాజల్ కోరుకుంది. ఎందుకంటే అది ఆమె కూతురి కోరిక. కానీ అది నేరవేరకుండానే బయటకు వెళ్లిపోయింది.బిగ్ బాస్ గేమ్ షోకు ఇంకోక వారంలో ఎండ్ కార్డ్ పడనుంది. 14 వారం చాలా కీలకం.ఇంట్లోని సభ్యులంతా ఎవరు విన్నర్ అవుతారు.. ఎవరు రన్నరప్‌గా నిలుస్తారో అని చాలా టెన్షన్ పడుతున్నారు. ఇక ఆడియెన్స్ వంతు వచ్చింది.

kajal About on shanmuk in Bigg boss 5 Telugu

kajal About on shanmuk in Bigg boss 5 Telugu

ఎవరిని ఫైనల్‌కు పంపించాలి. ఎవరిని సెకండ్ ప్లేస్ కు పరిమితం చేయాలన బ్రహ్మాస్తం వారి చేతుల్లోనే ఉంది. వారు వేసే ఓట్స్ ఆధారంగానే విజేత ఎవరనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. ప్రస్తుతం టైటిల్ రేసులో సన్నీ, షణ్ముక్ మాత్రమే ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వారం ఒక్క శ్రీరామ చంద్ర మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. కాజల్ ఎలాగు బయటకు వెళ్లిపోయింది. మిగిలిన మానస్, సన్నీ, షణ్ముక్, సిరి వీరిలో వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు. ఎవరు టైటిల్ కొట్టబోతున్నారని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

shanmuk: షణ్ముక్ నీ పద్ధతి ఇప్పుడైనా మార్చుకో..

ఈ వారం కాజల్ సరిగా టాస్కులు కంప్లీట్ చేయకపోవడం, తన కోసం కాకుండా సన్నీ, షణ్ముక్ అభిమానుల కోసం గేమ్ ఆడిందని అంతా అనుకుంటున్నారు. దీంతో ఆమె ఎలిమినేషన్ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఓట్లు కూడా మిగతా సభ్యులతో పోలిస్తే తక్కువే వచ్చాయి. అయితే , వెళ్లేముందు కాజల్ షణ్ముక్‌కు పలు సూచనలు చేసింది. కేవలం ఆట మీద దృష్టి పెట్టాలని, కోపం తగ్గించుకోవాలని సూచించింది. నువ్వు ముందులాగే నాతో మాట్లాడితే బాగుండు. కనీసం బయటకు వచ్చాకైనా నువ్వు మారుతావని కోరుకుంటున్నా అంటూ కాజల్ మనోడికి జ్ఙానోదయం చేసిందట.. ఆ తర్వాత సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయింది. అయితే, బిగ్‌బాస్ సీజన్ -5 విజేత సన్నీ అని జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది