
kajal aggarwal act in nagarjuna new movie
Kajal Aggarwal సినిమా ఇండస్ట్రీలో హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేయాల్సి వచ్చినప్పుడు దాదాపు అందరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. హీరోలు సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ బాడీ కోసం అలాగే, డిఫ్రెంట్ మేకోవర్ కోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. కొన్ని భారీ యాక్షన్ అండ్ ఛేజిన్స్ సీన్స్ కోసం ఒళ్లు హూనం చేసుకున్న సందర్భాలు లెక్కకు మించే ఉంటాయి. డాన్స్ విషయంలో కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకున్న హీరోలు..సందర్భాలు చాలానే. కథ, అందులో పాత్ర నచ్చితే మన స్టార్ హీరోలు ఎంతగానో తాపత్రయపడి ఆ పాత్రలో మెప్పించడానికి రక రకాల ప్రయత్నాలుచేస్తున్నారు.
kajal aggarwal act in nagarjuna new movie
ఇక హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడమే తప్ప ఎప్పుడో ఒకసారి తమలోని పూర్తి స్థాయి నటిని బయటకు తీసుకు వచ్చే కథ, పాత్రలు చేసే అవకాశం దక్కుతుంటుంది. అలాంటప్పుడు తమకున్న ఇమేజ్‌తో పాటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పాత్రలు ఒప్పుకుంటుంటుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ చేసే కొన్ని ఛాలెంజింగ్
రోల్స్ వాళ్ళ జీవితాన్ని తారా స్థాయికి చేర్చవచ్చు లేదా తలకిందులుగా మార్చవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి విషయంలో ఇదే జరిగింది. ‘అరుంధతి’ సినిమాతో తన ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆమె కోసమే కథలు పుట్టాయి. అదే అనుష్క ‘వేదం’ లాంటి సినిమాలో వేశ్య పాత్రలోనూ నటించి ప్రతీ ఒక్కరి మన్నలను పొందింది. ఈ సినిమా అనుష్క ఒప్పుకోవడమే పెద్ద సాహసం.
anushka shetty vedam
అయితే మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. అనుష్క మాదిరిగా వేశ్య పాత్రలో నటించబోతుందట. నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ పాత్ర చాలా డిఫ్రెంట్‌గా ఉంటుందట. బోల్డ్‌గా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ‘రా’ ఏజెంట్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ – రైఫిల్ షూటింగ్ లో కూడా శిక్షణ పొందిందట. స్పై క్యారెక్టర్ అయినా ఓ వేశ్యగా కూడా కొన్ని సీన్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్ లో ఇలాంటి పాత్ర అనుష్క తర్వాత మళ్ళీ కాజల్ అగర్వాల్ చేయడం ఆసక్తికరంగా మారుతుంది. త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ఇక కాజల్ అగర్వాల్ , ఆచార్య, ఇండియన్ 2, ముంబై సాగా లాంటి పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తోంది.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
This website uses cookies.