Akkineni Nageswara Rao : అక్కినేని, అన్నపూర్ణమ్మ పెళ్ళి.. మ‌ధ్య‌లో పేకాట‌కు సంబంధం ఏంటి..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 18, 2021, 2:55 pm

Akkineni Nageswara Rao తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర రావు Akkineni Nageswara Rao ఒక లెజండరీ యాక్టర్. ఆయన సినిమాల గురించి వాటిలో పోషించిన పాత్రల గురించి అందరికీ తెలిసిందే. సాంఘీకం, జానపదం, పౌరాణిక చిత్రాలలో ఏ ఎన్ ఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పట్లో ఎన్.టి.ఆర్, ఎస్ వి ఆర్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఏ ఎన్ ఆర్ సత్తా చాటారు. ఆయన మొదటి సినిమా ధర్మపత్ని నుంచి చివరి సినిమా మనం వరకు సినీ జీవితానికి సంబంధించిన దాదాపు అన్నీ విషయాలు ప్రపంచానికి తెలిసిందే. అయితే ప్రతీ ఒక్కరి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన విషయాలు నాగేశ్వర రావు విషయంలో కూడా చాలా ఉన్నాయి.

akkineni nageswara rao marriage secret

Akkineni Nageswara Rao అక్కినేని తండ్రి మరణించడంతో

ఏ ఎన్ ఆర్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆస్తిపంపకాలు జరిగాయి. అందులో ఆయనకి వచ్చిన వాటా 3000 రూపాయలు. ఆ డబ్బుతో నాగేశ్వర రావు Akkineni Nageswara Raoను బాగా చదివించాలనుకున్నారట వాళ్ళ అమ్మగారు. అయితే ఒకవేళ స్కూల్ కి వెళ్ళినా ఆయనకి చదువు అబ్బకపోతే ఉన్న కాస్త డబ్బు ఖర్చు అయితే ఎలా అని ఆలోచించి మధ్యలోనే మాంపించారట. ఆ తర్వాత ఏ ఎన్ ఆర్ కి నాటకాల మీద ఆసక్తి కలిగింది. ఏట ముఖానికి రంగు వేసుకున్న ఆయన 19వ ఏట వచ్చే వరకు రక రకాల నాటకాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నాటకాలలో మొదటిసారి అందుకున్న పారితోషికం అర్ద రూపాయి. అది క్రమంగా పెరిగి 5 రూపాయలకి పెరిగింది.

akkineni nageswara rao marriage secret

akkineni nageswara rao marriage secret

Akkineni Nageswara Rao అయినా అన్నపూర్ణమ్మ తండ్రి నమ్మకంగా పెళ్ళి చేశారు

ఈ క్రమంలో సినిమాలలో అవకాశాలు వచ్చి ధర్మపత్నితో నటుడిగా మారారు. ఆ తర్వాత క్ర‌మంగా ఆయన స్టార్ హీరో అయి బాగా సంపాదన పెరిగింది. దాంతో పెళ్ళి చేయాలనుకున్నారు. కానీ సినిమాలలో నటిస్తాడని ఎవరూ పిల్లనివ్వలేదట. సొంత మేనమామ కూడా కూతురును ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో ఎంతో నిరాశ చెందారట ఏఎన్ఆర్ Akkineni Nageswara Rao. అయితే పేకాటలో ఆటలో పరిచయం ఉన్న వ్యక్తి ..మా అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము.. ఎవరైన్నా ఉంటే చెప్పండి అన్నారట. అప్పుడు అందరు నాగేశ్వర రావు అని ఒకఅబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడు అని చెప్పారట. దాంతో ఏఎన్ఆర్ Akkineni Nageswara Raoకి ఇచ్చి అన్నపూర్ణమ్మను పెళ్ళి చేయాలని డిసైడయ్యారు. ఇంతలో కొందరు సినిమావాడు వద్దు అమ్మాయి జీవితం నాశనం అవుతుందని చెప్పారట. అయినా అన్నపూర్ణమ్మ తండ్రి నమ్మకంగా పెళ్ళి చేశారు. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో వాళ్ళందరికీ ఏ లోటూ రాకుండా అంతో ప్రేమగా సుకున్నారట. అందుకే అన్నపూర్ణ లాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అని ఏఎన్ఆర్ ఎన్నో సందర్భాలలో చెప్పారు.

akkineni nageswara rao marriage secret

akkineni nageswara rao marriage secret

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth : అనసూయ, రష్మీ.. ఇద్దరు యాంకర్లు కలిసిపోయారోచ్.. ఇక రచ్చ రంబోలానే?

ఇది కూడా చ‌ద‌వండి ==> Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్? అమ్మాయి ఎవరు? షాకింగ్ నిజాలు చెప్పిన సుధీర్ తండ్రి?

ఇది కూడా చ‌ద‌వండి ==> renu desai : రేణు దేశాయ్ ఆస్తి అన్ని కోట్లా ..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Drumstick : మునగకాయ తింటే.. ఆరోగ్య ప్రయోజనాలు పక్కన పెట్టండి.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త?

vamana sai

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp