Kajal Aggarwal : ఫ్యాష‌న్ డ్రెస్‌లో బేబి బంప్‌తో పిచ్చెక్కిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్

Authored By Sam C | The Telugu News | Published on: March 14, 2022, 8:00 pm

Kajal Aggarwal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజ‌ల్. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బాద్ షా, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి సౌత్ లో స్ట్రాంగ్ పాపులారిటీని దక్కించుకుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ కూడా మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుందీ స్టార్ హీరోయిన్.కాజ‌ల్ అగ‌ర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నప్ప‌టికీ సినిమాలు చేస్తూనే వ‌స్తుంది.

అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీగా ఉన్న కాజల్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోంది. అయితే అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ కాజల్ యాక్టివ్ గానే ఉంటోంది. తన గతంలో బాడీ షేమింగ్ పైనా పలువురు చేసిన కామెంట్లను తిప్పికొట్టింది. అదిరిపోయే కౌంటర్లతో స్పందించింది. జీవితంలోని ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే కాజ‌ల్ ఇటీవ‌ల త‌న బేబి బంప్ పిక్స్ తెగ షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది.తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ ట్రెండీ వేర్‌లో బేబి బంప్ చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది.ఈ అమ్మ‌డి మెస్మ‌రైజింగ్ లుక్స్ చూసి మ‌తులు పోతున్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్. టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ మే నెల‌లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

kajal aggarwal baby bump pic viral

kajal aggarwal baby bump pic viral

Kajal Aggarwal : కాజ‌ల్ సంద‌డి మాములుగా లేదు..

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలోఇటీవ‌ల కాజల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫోటోలను కాజల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ తన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తోంది. కుటుంబ సభ్యులతో సరదా గడుపుతోంది. కేరీర్ విషయానికొస్తే కాజల్ చివరిగా దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన మలయాళ చిత్రం ‘హే సినామిక’. ఈనెల 3న రిలీజ్ అయ్యింది. కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp