Kajal Aggarwal : వన్నె తగ్గని సుకుమారి.. అలా ఫోజిచ్చి సెగలు రేపుతున్న కాజల్ అగర్వాల్..
Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ అగర్వాల్ గతేడాది కొవిడ్ టైంలోనే గౌతమ్ కిచ్లూను మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పంచదార బొమ్మ..టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి దశాబ్దా కాలంగా హీరోయిన్‌గా ప్రేక్షకులు మెప్పు పొందింది. ప్రజెంట్ ఈ భామ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.ఇటీవల మ్యారేజ్ యానివర్సిరీ జరుపుకున్న కాజల్ అగర్వాల్.. భర్తతో దిగిన రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Kajal Aggarwal : ఆహా..అలా నిలబడి చేతుల మీద చేతులు వేసుకున్న కాజల్..
తాజాగా తన సూపర్ గ్లామరస్ ఫొటో ఒకదానిని ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. అది నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు ఫొటోలో కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. బ్రింజల్ కలర్ డ్రెస్సులో హై హీల్స్ వేసుకుని వయ్యారంగా వంగి నిలబడి మోకాలి అందాలు చూపుతూ సెగలు రేపుతోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘నైస్, లవ్ యూ, బొమ్మ, బ్యూటిఫుల్ కాజల్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి ఏడాది అయినప్పటికీ సుకుమారి వన్నె తగ్గలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ ప్రజెంట్ తన భర్తతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామ నటించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ‘ఖైదీ నెం.150’ ఫిల్మ్ తర్వాత మెగాస్టార్ చిరుతో ‘ఆచార్య’ చిత్రంలో మరోసారి జత కట్టింది ఈ అందాల చందమామ.