Kajal Aggarwal : తొలిసారి బేబి బంప్‌తో షాకిచ్చిన కాజ‌ల్‌.. ముద్దుగుమ్మ‌ని చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kajal Aggarwal : తొలిసారి బేబి బంప్‌తో షాకిచ్చిన కాజ‌ల్‌.. ముద్దుగుమ్మ‌ని చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

Kajal Aggarwal :క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటుంది. 2020 అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఏకంగా నెల రోజుల పాటు మాల్దీవ్స్ లో హనీమూన్ ఎంజాయ్ చేశారు ఈ జంట. ఇక ఈ ఏడాది మొద‌ట్లో కాజ‌ల్ ప్ర‌గ్నెంట్ అనే విష‌యాన్ని ప్ర‌క‌టించి అందరికి షాకిచ్చాడు కాజ‌ల్ భ‌ర్త. ప్ర‌స్తుతం కాజ‌ల్ మాతృత్వాన్ని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :8 February 2022,5:00 pm

Kajal Aggarwal :క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటుంది. 2020 అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఏకంగా నెల రోజుల పాటు మాల్దీవ్స్ లో హనీమూన్ ఎంజాయ్ చేశారు ఈ జంట. ఇక ఈ ఏడాది మొద‌ట్లో కాజ‌ల్ ప్ర‌గ్నెంట్ అనే విష‌యాన్ని ప్ర‌క‌టించి అందరికి షాకిచ్చాడు కాజ‌ల్ భ‌ర్త. ప్ర‌స్తుతం కాజ‌ల్ మాతృత్వాన్ని పొందేందుకు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తుంది. ప్రశాంతంగా బిడ్డను కని, తర్వాత కెరీర్ గురించి ఆలోచన చేయవచ్చు. బిడ్డ పుట్టాక కాజల్ బహుశా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం కలదు. హీరోయిన్ ఆఫర్స్ ఇకపై కష్టమే.

ప్రెగ్నెన్సీ త‌ర్వాత కాజల్ ఇంటి పట్టునే ఉంటుంది. గర్భం దాల్చడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలుసుకుంటోంది. స్పెషల్ కేర్ తీసుకుంటోంది. కొత్త విషయాలను నేర్చుకుంటోంది. తాజాగా కాజల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బాల్కనీలో అలా కాజల్ నిల్చుంది. అందులో కొద్దిగా బేబీ బంప్ కనిపిస్తోంది. సూర్యకిరణాలు నన్ను తాకుతున్నాయి.. అవే ఎంతో సురక్షితమైనవి అన్నట్టుగా కాజల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తొలిసారి బేబి బంప్‌లో క‌నిపిస్తున్న కాజ‌ల్‌ని చూసి ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

kajal aggarwal latest baby bump pics goes viral

kajal aggarwal latest baby bump pics goes viral

Kajal Aggarwal : కాజ‌ల్ క్యూట్ లుక్స్..

కాజల్ హీరోయిన్ గా నటించిన మల్టీస్టారర్ ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది.-చిరంజీవి చరణ్ నటిస్తున్న ఈ మూవీలో ఆమె చిరుకు జంటగా నటించారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆచార్యలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక హిందీలో ఒక చిత్రంతో పాటు, తమిళంలో మూడు చిత్రాల వరకూ నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో అధిక చిత్రాలు చేసిన కాజల్… హిందీలో కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. సౌత్ లో లాంగ్ కెరీర్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ నిలిచారు. పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్ వ్యాపార వృద్ధికి కాజల్ తన వంతు సాయం చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది