Kajal Aggarwal : కాజ‌ల్‌ అగ‌ర్వాల్ ని వ‌ద‌ల్లేదు.. బాడీ షేమ్ చేయ‌డంతో ఘాటుగా స్పందించిన చంద‌మామ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kajal Aggarwal : కాజ‌ల్‌ అగ‌ర్వాల్ ని వ‌ద‌ల్లేదు.. బాడీ షేమ్ చేయ‌డంతో ఘాటుగా స్పందించిన చంద‌మామ‌

Kajal Aggarwal: టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెన్సీ వ‌ల‌న సినిమాల‌కు దూరంగా ఉంటూ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. 15 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. అయితే రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆమె తల్లి కావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న కాజల్ అగర్వాల్ తన బేబి బంప్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 February 2022,12:00 pm

Kajal Aggarwal: టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెన్సీ వ‌ల‌న సినిమాల‌కు దూరంగా ఉంటూ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. 15 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. అయితే రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆమె తల్లి కావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న కాజల్ అగర్వాల్ తన బేబి బంప్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. . ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫ్యామిలీతో సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. అయితే త‌న ఫొటోల‌పై కొంద‌రు త‌ప్పుడు కామెంట్స్ చేస్తుండ‌డంతో కాజ‌ల్ ఘాటుగా స్పందించింది.

తన ఇన్‏స్టా ఖాతాలో ఇదే విషయమై సుధీర్ఘ పోస్ట్ చేసింది కాజల్…నా జీవితంలో.. నా శరీరంలో.. ఇంట్లో.. పని ప్రదేశంలో అనేక మార్పులు వచ్చాయి. వాటన్నింటినీ నేను ఎంజాయ్ చేస్తున్న.. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్స్, మీమ్స్ వలన నాకు ఏలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే.. కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో సహా మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్ది పొట్ట కూడా పెరుగుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడతాయి.

kajal aggarwal reacts on body shaming comments

kajal aggarwal reacts on body shaming comments

Kajal Aggarwal :  కాజ‌ల్ స్ట‌న్నింగ్ స‌మాధానం..

మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. అలాగే ఇలాంటి సమయంలో తొందరగా అలసిపోతాం. ప్రతికూలంగా ఆలోచించడం వల్ల అనారోగ్యంబారిన పడతాం. ఇక బిడ్డ పుట్టాక మళ్లీ మునుపటిలా అవడానికి కొంత సమయం పట్టవచ్చు, లేదంటే మునుపటి స్థితికి మన శరీరం రాకపోవచ్చు కూడా. అయినా సరే, ఏం పర్లేదు. ఈ మార్పులన్నీ సర్వసాధారణమే. మన జీవితాల్లోకి ఓ పాపాయి రాబోతుందన్నప్పుడు వాటన్నింటినీ పట్టుకుని వేలాడుతూ అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవకండి. చిన్నారికి జన్మనివ్వడం అనేది వేడుక అన్న విషయాన్ని గుర్తుంచుకోండి’ అని కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది