Kajal Aggawal: అందంతో క‌ట్టిప‌డేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఆ చూపుల‌కి ప‌డిపోవ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kajal Aggawal: అందంతో క‌ట్టిప‌డేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఆ చూపుల‌కి ప‌డిపోవ‌ల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 January 2022,12:00 pm

Kajal Aggawal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు దాటింది. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ త‌న ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకొని ఓ ఇంటిదైంది. త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ కూడా ఇవ్వ‌నుంది. అయితే ఈ మ‌ధ్య కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి ఫొటో షూట్స్‌తో ఎక్కువ‌గా అభిమానుల మ‌న‌సులు దోచుకుంటుంది. ఆ మ‌ధ్య బేబి బంప్‌తో సంద‌డి చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కూల్ లుక్‌లో మెరిసి మ‌తులు పోగొడుతుంది. ప్ర‌స్తుతం కాజ‌ల్ స్ట‌న్నింగ్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

కాజల్‌ గర్భవతి అని ఇటీవల గౌతమ్‌ కిచ్లు కన్ఫార్మ్‌ చేశారు. గర్భవతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి భార్య కోసం గౌతమ్‌ కిచ్లు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను కూడా నియమించారు. ఈ ‘ప్రీ న్యాటల్‌ క్లాసెస్‌’కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా తెలియజేస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. డెలివరీ వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీ అయ్యాక పాటించాల్సినవి.. ఇవన్నీ కూడా ఈ క్లాసెస్‌లో అడిగి తెలుసుకుంటున్నారట.

kajal aggawal mesmerizing looks viral

kajal aggawal mesmerizing looks viral

Kajal Aggawal : చూపుల‌తో క‌ట్టిప‌డేస్తున్న కాజ‌ల్..

ఇక కాజ‌ల్ సినిమాల విష‌యానికి వస్తే ఈ అమ్మ‌డు ఉమ అనే సినిమాలో న‌టించింది. బాలీవుడ్‌లో రూపొందిన ఈ సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇందులో తానొక మిస్టీరియ‌స్ అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని చెప్పిందీ అమ్మ‌డు. ఆచార్య‌, ఇండియ‌న్ 2 చిత్రాల‌లోను కాజ‌ల్ న‌టించింది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్ ఇలా స్టార్ హీరోలంద‌రి సినిమాల్లోనూ న‌టించి న‌టిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వ‌చ్చింది కాజ‌ల్.

Also read

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది