Kalki 2898 Movie : కల్కి గ్లింప్స్‌ని ఆ ప్రత్యేక ప్రాంతంలోనే విడుదల చేయడం వెనక ఇంత పెద్ద కారణం ఉందా?
ప్రధానాంశాలు:
Kalki 2898 Movie : కల్కి గ్లింప్స్‌ని ఆ ప్రత్యేక ప్రాంతంలోనే విడుదల చేయడం వెనక ఇంత పెద్ద కారణం ఉందా?
Kalki 2898 Movie : సలార్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి. మహానటి వంటి సినిమా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. చిత్రంలో దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి ఉన్నా ఎలక్షన్స్ వలన వాయిదా పడింది. ఇక రీసెంట్‌గా మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఓ పవిత్రమైన ప్రదేశంలో దానిని విడుదల చేయగా, అందుకు గల కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. మూవీలో అశ్వత్తామ అనే పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు.
Kalki 2898 Movie : ఇప్పటికీ వారికి నమ్మకం ఉంది..
కల్కి చిత్ర కథ పురాణాలకు సంబంధించినది కావడంతో సినిమా ఫాంటసీ, ఫిక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. మూవీ గ్లింప్స్‌ని మధ్య ప్రదేశ్‌లోని నేమావార్ ప్రాంతంలో రిలీజ్ చేయగా, దాని వెనక అసలు కారణం ఏంటంటే.. చరిత్రలో అశ్వత్తామ నడిచిన ప్రాంతంగా నేమావర్‌ని భావిస్తారు. అయితే ఇంకా ఆయన అక్కడే ఉన్న పవిత్రమైన అనుభూతి ఆ ప్రాంతవాసులకు ఉంటుంది కాబట్టి ఆ నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని అమితాబ్ బచ్చన్‌కి సంబంధించిన గ్లింప్స్‌ని ఆ ప్రాంతంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ గ్లింప్స్‌లో షాట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓ షాట్ లో అమితాబ్ యంగ్ లుక్ లో చూపించారు. అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించి దర్శకుడు నాగ్అశ్విన్ అమితాబ్‌ని అలా చూపించారు. గ్లింప్స్‌లో అమితాబ్ యంగ్ లుక్ కోరమీసంతో లాంగ్ హెయిర్‌లో అద్భుతంగా ఉంది. అమితాబ్ యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అచ్చం అలాంటి లుక్‍నే టెక్నాలజీతో సాధించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన ఇప్పుడు నాగ్ అశ్విన్.. అమితాబ్ ని చూపించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.