Breaking : ఆంధ్రప్రదేశ్ కి కల్వకుంట్ల కవిత – BRS బాధ్యతలు..!
Breaking : టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ అంటే కేవలం తెలంగాణ మాత్రమే కాదు.. దేశమంతా విస్తరించాలి. దేశమంతా బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు పార్టీ హైకమాండ్ సమాయత్తం అవుతోంది. ముందుగా మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఏపీలో ఒక బహిరంగ సభ పెట్టి ఏపీ మొత్తాన్ని తన వైపునకు లాగేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈనెల 19 న ఖమ్మంలో కేసీఆర్ సభ ఉన్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని ఏపీ బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం కూడా అందిందట. ఈసారి ఖమ్మం సభ మొత్తాన్ని ఎమ్మెల్సీ కవిత దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట. సభ నిర్వహణ మాత్రమే కాదు..
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టనున్నారట. అందుకే ఈ నెల చివర్లో ఏపీలో కవిత పర్యటించనుందట. అలాగే… బీఆర్ఎస్ సమన్వయకర్తగా కవితకు బాధ్యతలు కూడా అప్పగిస్తారని సమాచారం. ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారని సమాచారం. ఏపీకి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు రావెల కిషోర్ బాబు, పార్థసారథితో కవిత సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ చేరికలు, విస్తరణ దిశగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పలువురు
Breaking : ఏపీలో చేరికలు, విస్తరణ దిశగా చర్యలు
బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియడంతో ఏపీలో పార్టీ విస్తరణ దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం సభ మీదనే ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఆ తర్వాత ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అలాగే.. బడ్జెట్ సమావేశాల తర్వాత కేసీఆర్.. దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణ కోసం ముందడుగు వేయనున్నారు. ఖమ్మం సభ ముగిసిన తర్వాత ఈనెల 29న ఎమ్మెల్సీ కవిత ఏపీలో పర్యటించే అవకాశం ఉంది. అలాగే.. వచ్చే నెల సీఎం కేసీఆర్ కూడా ఏపీలో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన సమయంలో కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.