Hyper Aadi : వస్తావా? అన్నట్టుగా హైపర్ ఆది సైగలు.. పగిలిపోద్ది అన్నట్టుగా కనకవ్వ రియాక్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : వస్తావా? అన్నట్టుగా హైపర్ ఆది సైగలు.. పగిలిపోద్ది అన్నట్టుగా కనకవ్వ రియాక్షన్

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,12:40 pm

Hyper Aadi : ప్రతి ఆదివారం బుల్లితెరపై ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఒకటి. ప్రతివారం ఒక్కో కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ కార్యక్రమం తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా వచ్చేవారం బోనాల జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కనకవ్వ సందడి చేశారు.అయితే ఈ ప్రోమోలో భాగంగా కనకవ్వ పొట్టి నరేష్ పై డైపర్లు అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే హైపర్ ఆది కనకవ్వ ఇద్దరు ఒకే చోట కూర్చుండగా రష్మి దగ్గరకు వెళ్లి హైపర్ ఆది గారు మీరు అవ్వతో ఫర్ఫార్మ్ చేశారు ఎలాగ అనిపించిందని ప్రశ్నించారు. దీంతో హైపర్ ఆది కనకవ్వ చేతిని తన చేతిలోకి తీసుకొని కనుబొమ్మలు ఎగిరేస్తూ వస్తావా అన్నట్టు సైగ చేశాడు. అయితే కనకవ్వ సైతం హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

Kanakavva give counter to Hyper Aadi sarees in sridevi drama company show

Kanakavva give counter to Hyper Aadi sarees in sridevi drama company show

నాలుక మడత పెట్టిన కనకవ్వ…

తాను కూడా కనుబొమ్మలు ఎగిరేస్తూ సైగలు చేస్తూ ఒక్కసారిగా నాలుక మడత పెట్టి పగులుద్ది అన్నట్టు రియాక్షన్ ఇచ్చారు. ఈ విధంగా కనకవ్వ రియాక్షన్ ఇవ్వడంతో హైపర్ ఆది ఒక్కసారిగా తన చేతిని వదిలిపెట్టి సెట్ రైట్ అయ్యారు. ఇక కనకవర్ యాక్షన్ చూసిన వారందరూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున నవ్వారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు వేదికపై ఆటపాటలతో సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది