Karthika Deepam 1 June Today Episode : హిమ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసిన నిరుపమ్.. దీంతో హిమ షాకింగ్ నిర్ణయం.. ఈ విషయం సౌందర్యకు తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 1 June Today Episode : హిమ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసిన నిరుపమ్.. దీంతో హిమ షాకింగ్ నిర్ణయం.. ఈ విషయం సౌందర్యకు తెలుస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :1 June 2022,10:30 am

Karthika Deepam 1 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 1367 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వేమో దాన్ని తలుచుకుంటూ పెళ్లి వద్దంటున్నావు. తనేమో పెళ్లి చేసుకుంటోంది అని నిరుపమ్ తో చెబుతుంది స్వప్న. దీంతో నువ్వు నమ్మవని నాకు తెలుసు. విజయవాడలో చంద్రశేఖర్ రావు గారు తెలుసా? ఆయన అబ్బాయితోనే హిమ పెళ్లిని ఫిక్స్ చేస్తున్నారు అని స్వప్న చెబుతుంది. దీంతో మమ్మీ ఇది నిజమా అంటాడు నిరుపమ్. లేకపోతే ఎక్కడో ఉండే చంద్రశేఖర్ రావు గురించి నాకెలా తెలుస్తుంది. వాళ్ల అబ్బాయి కూడా డాక్టర్ అని నాకెలా తెలుస్తుంది. నిన్ను కాదన్న హిమ ఏంచక్కా అక్కడ ఇంకో డాక్టర్ ను పెళ్లి చేసుకుంటోంది. నువ్వేమో అసలు పెళ్లే వద్దంటున్నావు. నాకోసం అయినా శోభను పెళ్లి చేసుకో నిరుపమ్ అంటుంది స్వప్న. దీంతో మమ్మీ నా పెళ్లి గురించి మాట్లాడొద్దు అన్నానా అంటాడు నిరుపమ్. మళ్లీ హిమ పెళ్లి నిజంగా జరుగుతోందా అని అంటాడు. దీంతో మీ అమ్మమ్మను వెళ్లి అడుగు అంటుంది స్వప్న.

karthika deepam 1 june 2022 full episode

karthika deepam 1 june 2022 full episode

అమ్మమ్మ చేస్తుందా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేనూ చూస్తాను అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. మరోవైపు తన నానమ్మతో కలిసి కాసేపు గడపడంతో చాలా సంతోషిస్తుంది జ్వాల. నానమ్మ నన్ను ఎన్నిసార్లు చూసినా.. నాతో మాట్లాడినా ఇది మా శౌర్యలాగానే ఉంది అని ఎప్పుడూ అనుకోదు ఏంటో అని అనుకుంటుంది జ్వాల. నేను చిన్న చిన్న క్లూలు ఇస్తున్నా కూడా నానమ్మ జోక్ వేస్తున్నా అనుకుంది తప్పా అస్సలు పట్టించుకోదు. నన్ను సరిగ్గా చూడనే చూడదు. నేను శౌర్య అని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేదు ఏంటో అని అనుకుంటుంది జ్వాల. ఆ హిమ పెంకితనం ఇంకా అలాగే ఉందా. తను ఇంకా మారలేదా. అవునులే ఎందుకు మారుతుంది. డబ్బు, హోదా ఉన్నాయి కదా. హాయిగా జల్సాగా బతికేస్తుందేమో.. అని అనుకుంటుంది జ్వాల.

నా మొగుడు గురించి ఆలోచించాలి కానీ.. అని నిరుపమ్ గురించి ఆలోచిస్తుంది. డాక్టర్ సాబ్.. ఏం చేస్తున్నావు. ఎప్పుడు కలుస్తున్నావు. ఎప్పుడో ఏంటి.. తింగరి ఫోన్ చేసి హాస్పిటల్ కు రమ్మన్నది కదా. వెళ్లి డాక్టర్ సాబ్ ను కలుస్తాను అని అనుకుంటుంది.

మరోవైపు హిమను పిలుస్తాడు నిరుపమ్. తనతో ఏకాంతంగా మాట్లాడుతాడు. కారులో హిమ రాగానే దిగు అంటాడు. దీంతో నాకు అర్జెంట్ పని ఉంది అంటుంది హిమ. దిగు అని కారు డోర్ లాగి తనను కిందికి దించుతాడు. నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావో ఇప్పటి వరకు చెప్పలేదు అంటాడు నిరుపమ్.

Karthika Deepam 1 June Today Episode : హిమతో గొడవ పెట్టుకున్న నిరుపమ్

కొన్ని రోజులు అయ్యాక అయినా చెబుతావని అనుకున్నా కానీ.. ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధమయ్యావని అడుగుతున్నా. ఆ పెళ్లిని నేను క్యాన్సిల్ చేస్తాను అంటాడు నిరుపమ్. నీకు పెళ్లంటూ జరిగితే నాతో నే జరుగుతుంది. ఇంకెవరితోనూ జరగదు అంటుంది.

ఇంతలో అదే రూట్ లో ఆటోలో వెళ్తూ నిరుపమ్ ను చూసి ఆగుతుంది జ్వాల. అసలు నువ్వు ఏం దాస్తున్నావో నాకు ఈరోజే తెలియాలి అని హిమతో అంటాడు నిరుపమ్. ఆటో దిగి.. ఏంటి వీళ్లిద్దరు ఇక్కడ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నేను వీళ్లను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అని అనుకుంటుంది.

ఇంతలో జ్వాలను చూస్తుంది తింగరి. బావ.. నీకు దండం పెడతాను. ఇప్పుడు ఏమీ అల్లరి చేయకు అంటుంది హిమ. నేను అల్లరి చేయడం కాదు. నువ్వే కొత్త నిరుపమ్ ను చూస్తావు అంటాడు నిరుపమ్. జ్వాల మనల్ని చూస్తుంది అని చెబుతుంది జ్వాల.

ఇంతలో జ్వాల అక్కడికి వస్తుంది. దీంతో వీళ్లు ఏదో ఆపరేషన్ అంటూ మాట్లాడుతారు. దీంతో ఆపరేషన్ కోసం వీళ్లు గొడవ పడుతున్నారా అని అనుకుంటుంది జ్వాల. చూడు.. నేను చెప్పేది విను.. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటాడు నిరుపమ్.

దీంతో నీ ఆపరేషన్ నువ్వు చేయి.. నా ఆపరేషన్ నేను చేస్తాను అంటుంది హిమ. దీంతో నీ మనసులో ఏముందో నాకు తెలియాలి. నాకు చెప్పకుండా చేయకుండా ఇలాంటి పనులు చేస్తే నేను ఊరుకోను అంటాడు నిరుపమ్. అసలు.. మీ ఇద్దరి గొడవ ఏంటి అని అడుగుతుంది జ్వాల.

మీరేంటి.. ఈ టైమ్ లో గొడవ పడటం ఏంటి అని అడుగుతుంది జ్వాల. దీంతో తననే అడుగు చెబుతుంది అంటాడు నిరుపమ్. తింగరి ఏమో.. బావనే అడుగు చెబుతాడు అంటుంది తింగరి. నేను వెళ్తున్నాను. నా మూడ్ బాగోలేదు. నేను చెప్పినట్టు తను వినట్లేదు. నేను హర్ట్ అయ్యాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.

ఆయన చెప్పిన మాట వినొచ్చు కదా అని తింగరితో అంటుంది జ్వాల. దీంతో నీకు తెలియదు జ్వాల.. బావేమో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వేమో బావను ప్రేమిస్తున్నావు. ఎలా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో డాక్టర్ సాబ్ మళ్లీ వస్తాడు.

డాక్టర్ సాబబ్ చెప్పిన మాట విను. ఆయనది మంచి మనసు అంటుంది జ్వాల. అసలు ఏమైందో తెలుసా? నేను చెబుతానురా అని అంటూ జ్వాలను తీసుకెళ్లబోతాడు నిరుపమ్. కానీ.. హిమ అడ్డుకుంటుంది. దీంతో ఏం చేయాలో జ్వాలకు అర్థం కాదు.

తర్వాత నిరుపమ్, జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు సౌందర్య.. ఆనందరావు దగ్గరికి వస్తుంది. ఏమండి.. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది సౌందర్య. మనం చూసిన విజయవాడ సంబంధం వాళ్లకు నిరుపమ్ కాల్ చేశాడట అంటుంది సౌందర్య.

సౌందర్య చెప్పే మాటలను హిమ.. చాటుగా వింటుంది. బావ మనసు మార్చాలని నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదేంటి అని అనుకుంటుంది. ఇలా అయితే బావకు శౌర్యతో పెళ్లి ఎలా చేయాలి. శోభను పెళ్లి చేసుకోమని స్వప్న అత్త బలవంతపెడుతోంది.

ఇదే మంచి సమయం.. నిరుపమ్ బావ మనసులో శౌర్య ఉండేలా చూసుకోవాలి అని అనుకుంటుంది హిమ. ఏంటో సౌందర్య.. మన ఫ్యామిలీ మొత్తం ఎన్నో సమస్యలను ఎదుర్కుంటోంది. సమస్యలన్నీ మన చుట్టే తిరుగుతున్నాయి అంటాడు ఆనంద రావు.

కట్ చేస్తే హాస్పిటల్ లో హిమ దగ్గరికి వచ్చిన నిరుపమ్.. హిమను సీరియస్ గా చూస్తాడు. హిమ.. ఈ దాగుడు మూతల ఆటను ఇకనైనా ఆపుతావా అంటాడు. ఏంటి మాట్లాడవు అంటాడు నిరుపమ్. నిశ్చితార్థం రోజున ఆఖరి నిమిషంలో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పావు గుర్తుందా అంటాడు నిరుపమ్.

హిమ.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నావు కానీ.. బావ ఇష్టం లేదనలేదు అంటాడు నిరుపమ్. హిమ.. ఈరోజు నువ్వు మౌనం వీడాలి. పెళ్లి ఇష్టం లేదంటే.. నన్ను ప్రేమించింది కదా.. ఇప్పుడు ఇష్టం లేదేమో అనుకున్నాను. కానీ.. నువ్వు ఏకంగా వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నేను నమ్మలేకపోతున్నాను.

నిజం చెప్పు హిమ. ఏదో జరిగింది. ఎందుకో భయపడుతున్నావు. చెప్పు హిమ. నన్ను ప్రేమించింది నిజం కాదా అని ప్రశ్నిస్తాడు నిరుపమ్. మనం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు హిమ. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అంటాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది