Karthika Deepam 14 Oct Today Episode : దుర్గ పెట్టె టార్చర్ ని తట్టుకోలేకపోతున్న మౌనిత.. గతం గుర్తుకు రానట్టుగా నటిస్తున్న కార్తీక్…!
Karthika Deepam 14 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1483 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. వారణాసి ని కొట్టింది ఎవరు? నేను బ్రతికున్న సంగతి పిల్లలకు తెలుసా లేదా అని వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీనంతటికీ కారణం ఆమోనితే మౌనితని తిట్టుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే దీప ఏడుస్తూ అది అనుకున్నదే సాధించింది నేను ఓడిపోయాను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పెద్ద ఆవిడ నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు. డాక్టర్ బాబు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. డాక్టర్ బాబుని నా జీవితంలో నుంచి తీసుకెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దుర్గా వచ్చి ఆ మౌనిత కూడా డాక్టర్ బాబు ఎక్కడున్నాడో తెలియక కంగారుపడుతుంది ఇది నిజం అని చెప్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ కూడా అవునమ్మా ఇది నిజమై ఉంటది అని అంటాడు. అప్పుడు దుర్గ మళ్లీ నేను సంగారెడ్డి వెళ్తాను కార్తీక్ బాబుని వెతుకుతాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు పెద్ద ఆవిడ ఇది మంచికే జరిగింది. అని అంటుంది.
అప్పుడు దీప వెళ్ళిపోతే ఏం కాదు ఎలాగో ఒకలా మనం వెతుకుతాం లేదా తానే తిరిగి వస్తాడు కానీ నా మౌని తా దాచిపెడితేనే కష్టం అని అంటూ ఉంటుంది. అప్పుడా పెద్ద ఆవిడ దీప కి ధైర్యం చెబుతూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ఫోటోను చూస్తూ ఎక్కడికెళ్ళిపోయావు.. అయినా నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు కార్తీక్ నీ కోసం ఎంతో త్యాగం చేశానే అంటూ.. వచ్చేయ్ కార్తిక్ అని గట్టిగా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వర్కర్లు దుర్గ మౌనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే దీప వంట చేస్తూ సంతోషంతో ఉండడం చూసి డాక్టర్ ఏమైందో మా దీప అనగానే గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఏదేదో చేస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు అన్నయ్య నా డాక్టర్ బాబు నాకు కావాలి ఆయన లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దుర్గ నేనిప్పుడే తెలుసుకుని వచ్చాను. ఆ మౌనితకి డాక్టర్ బాబు గురించి తెలియదు సంగారెడ్డి లోనే తప్పిపోయాడు అని చెప్పగానే.. దీప అయితే ఇప్పుడే వెళ్లి వెతుకుదాం అని అంటూ ఉంటుంది. అప్పుడు దుర్గ నువ్వు ఎందుకు నేను వెళ్తాను అనగానే వద్దు ఇద్దరం కలిసి వెళ్దాం అని దీప వస్తుండగా కార్తీక్ కి దీపకి ఎదురుపడతాడు. ఇప్పుడు దీప కార్తీక్ ని ఏమైంది ఆ కట్టు ఏంటి అని కంగారుపడుతూ ఉంటుంది.
![Karthika Deepam 14 october 2022 full episode](https://thetelugunews.com/wp-content/uploads/2022/10/Jin-Mayajalam.jpg)
Karthika Deepam 14 october 2022 full episode
అప్పుడు కార్తీక్ ఎవరి మీదకు ఎవరు రాయిస్తే అది నాకు తగిలినట్లుంది అని అనగానే… దీప చూసుకోవాలి కదా డాక్టర్ బాబు అంటూ తనని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తుంది. అప్పుడు కార్తీక్ నాకోసం ఎంత తపన పడ్డావు… అని బాధపడుతూ ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చిన సంగతి నీకు చెప్పను ఆ మౌనిక సంగతి చెప్పిన తర్వాత నీ దగ్గరికి వస్తా అని అంటూ ఉంటుంది. సరే మౌనిత వచ్చిందా.. అంటూ నాకు తోడుగా అక్కడి వరకు వస్తావా వంటలక్క అనగానే దీప డాక్టర్ బాబును తీసుకొని వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే శౌర్య మోనిత ఆంటీ ఎందుకు అలా అబద్ధం ఆడుతుంది. తెలుసుకోవాలి అని మౌనిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే దీప కార్తీక్ మౌనిత ని ఇంటికి తీసుకొచ్చి.. మిమ్మల్ని ఎవరు కొట్టలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఎవరు కొట్టలేదు అని చెప్తాడు. ఇక మౌనితా పోలీసులతో మాట్లాడుతూ ఉండగా.. కార్తీక్ వచ్చి ఆ ఫోన్ తీసుకొని నేను వచ్చేసాను అని చెప్తూ ఉంటారు. ఏం జరిగింది అతనికి ఆకట్టు ఏంటి నువ్వు పక్కనే ఉన్నావా దీప అని తనపై దాడి చేస్తూ ఉంటుంది.
అప్పుడు మౌనితని కార్తీక్ తిట్టి వంటలక్క నువ్వు ఇంటికి వెళ్ళు జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప వెళ్ళిపోతుంది. మౌనితా మాత్రం కార్తీక్ ని తన మీద అంత ప్రేమ ఎందుకు అని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నాకు దెబ్బ తగిలింది అది వదిలిపెట్టి వంటలక్క గురించి ఎందుకు మాట్లాడతావు అని అంటూ ఉండగా దుర్గ వచ్చి మౌనిత నువ్వు రాత్రి నా దగ్గర మనిద్దరం కలిసి వచ్చాం కదా అప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావు అని కార్తీకి అనుమానం వచ్చేలా చేస్తు ఉంటాడు దుర్గ. ఇక రేపటి ఎపిసోడ్లో దుర్గ మౌనితా దగ్గరికి వచ్చి నువ్వు దీప ని చంపాలని మనుషులు పెట్టావు కదా.. అయినా దీప చంపడం వల్ల మనకేం లాభం కార్తీక్ కదా మనకు అడ్డం వచ్చేది కార్తీక్ చంపడానికి కదా నువ్వు మనుషులు పంపించింది అని అంటూ ఉంటాడు దుర్గ. అప్పుడు మౌని తా నన్ను వదిలేయ్ రా బాబు అని దండం పెడుతూ వస్తుండగా కార్తీక్ వస్తాడు కార్తీక్ నీ చూసి కంగారు పడిపోతూ ఉంటుంది మౌనితా.. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…