Karthika Deepam 29 Nov Episode Highlights : బస్తీకి వెళ్లి అడ్డంగా బుక్కయిన మోనిత.. బస్తీలో మోనితకు భారీ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 29 Nov Episode Highlights : బస్తీకి వెళ్లి అడ్డంగా బుక్కయిన మోనిత.. బస్తీలో మోనితకు భారీ షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :28 November 2021,9:00 am

Karthika Deepam 29 Nov Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక్ దీపం 29 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1208 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసు కదా. కార్తీక్ ఫ్యామిలీ సంతోషంగా ఉండటం చూసి మోనిత తట్టుకోలేకపోతుంది. దీంతో కార్తీక్ ను ఫాలో అవడానికి క్యాబ్ తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తుంది. అక్కడే వెయిట్ చేస్తుంది. కార్తీక్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తుంది.

karthika deepam 29 november 2021 episode highlights

karthika deepam 29 november 2021 episode highlights

మరోవైపు కార్తీక్, దీప.. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. టిఫిన్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి బస్తీకి బయలుదేరుతారు. అంతకుముందే.. పిల్లలతో కలిసి సౌందర్య, ఆనందరావు.. ఇద్దరూ పార్క్ కు వాకింగ్ కు వెళ్తారు. అయితే.. కార్తీక్, దీప, ఆదిత్య టిఫిన్ చేస్తుంటే వచ్చిన మురళి కృష్ణ.. బయట మోనితను చూశానని దీపతో చెబుతాడు. దీంతో షాక్ అవుతుంది దీప. వెంటనే వెళ్లి డాక్టర్ బాబుకు ఈ విషయం చెబుతుంది. దాని మొహం.. అదేం చేస్తుంది అని అంటాడు కార్తీక్.

కట్ చేస్తే.. కార్తీక్, దీప ఇద్దరూ కలిసి బస్తీకి బయలు దేరుతారు. ఇంటి బయట చూస్తారు. ఎక్కడా మోనిత కనిపించదు. మోనిత కారుతో సహా.. కార్తీక్ కు కనిపించకుండా దాక్కుంటుంది. కార్తీక్ కారు బయలుదేరగానే.. ఆ కారును ఫాలో చేస్తుంది.

బస్తీకి వెళ్లి కార్తీక్ ఉచిత క్యాంప్ నిర్వహిస్తాడు. బస్తీ నుంచి అందరూ వచ్చి దీప, కార్తీక్ ను పలకరిస్తారు. బస్తీ వాళ్లు అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. నేను మీకు ఎవ్వరికీ ఏం కాను. కానీ.. కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించారు. కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.. అంటుంది దీప.

ఏం చేసినా మీ రుణం తీరదు అంటుంది దీప. మేమేం చేశాం అక్క.. నువ్వే అప్పటి దాన్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటున్నావు అంటాడు వారణాసి. నాకు బస్తీకి వస్తే పుట్టింటికి వచ్చినట్టే అనిపిస్తుంది అంటుంది దీప.

Karthika Deepam 29 Nov Episode Highlights : కార్తీక్ కోసం బస్తీకి వచ్చిన మోనిత

మరోవైపు చెకప్ కు వచ్చిన ఓ మహిళ.. వాళ్ల నాన్న కోసం ఏడుస్తున్నాడు బాబు అంటుంది. నాన్న కోసం ఏడ్వడం ఏంటి అంటాడు కార్తీక్. నాకు కొడుకులే పుట్టారు.. అమ్మాయి పుట్టలేదని వాళ్ల నాన్న వదిలేసి వెళ్లిపోయాడు అని చెబుతుంది ఆ మహిళ.

వీడేమో వాళ్ల నాన్న కావాలని ఏడుపు అంటుంది. ఆడపిల్ల పుట్టకపోతే మీరేం చేస్తారు అంటాడు కార్తీక్. అసలు మనిషేనా.. కన్నతండ్రి కాదా అని అంటాడు కార్తీక్. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి.. ఇదే మాట నేను అడిగితే అంటుంది మోనిత.

నువ్వా అంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్ షాక్ అయ్యావా? నేను వస్తానని ఊహించలేదా అంటుంది మోనిత. ఏమన్నావు కార్తీక్ ఇందాకా.. వాడసలు మనిషేనా.. తండ్రేనా అన్నావు కదా. నాకు చేసిన అన్యాయం కూడా ఇదే కదా కార్తీక్ అంటుంది మోనిత. న్యాయం నీకొకటి.. ఇంకొకరికి మరొకటా అని ప్రశ్నిస్తుంది.

నా బిడ్డను వదిలేశావు.. నన్ను వదిలేశావు. ఇక్కడికి వచ్చి పెద్ద ఆదర్శమూర్తిలా బిల్డప్ ఇస్తున్నావా? అంటుంది మోనిత. దీంతో దీప అందుకొని.. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. న్యాయం కావాలి అంటుంది. నువ్వు నేను బస్తీలో ఉన్నాం. ఇక్కడి వాళ్ల సంగతి నీకు తెలియదు అని అంటుంది దీప.

కార్తీక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నా బిడ్డకు కార్తీకే తండ్రి అని ఒప్పుకోవాలి.. అంటుంది మోనిత. చేసిందే తప్పు.. ఆ తప్పును డాక్టర్ బాబు మీదికి నెడుతోంది. ఆ బిడ్డకు.. డాక్టర్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మోనితే మోసం చేసింది బిడ్డను కన్నది అని చెబుతుంది దీప. దీంతో బస్తీ వాళ్లంతా మోనిత మీదికి చీపుర్లు పట్టుకొని వెళ్తారు. ఏంటమ్మా నీ గోల.. మా బస్తీ వాళ్ల సంగతి నీకు తెలియదు.. అని తన మీద దాడి చేయబోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది