Karthika Deepam 29 Sep Today Episode బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీక దీపం’సీరియల్ కథలో కొత్త పాత్రల ఎంట్రీతో కథలో కీలక మలుపు వచ్చేసింది. బుధవారంతో 1157వ ఎపిసోడ్‌కు ఈ సీరియల్ ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్‌లో చాలా హైలైట్స్ ఉండటం గమనార్హం. ‘అమ్మమ్మా, తాతయ్యా’ అంటూ ఎంట్రీ ఇచ్చిన అబ్బాయిలిద్దరు తాజాగా వారి పేర్లు ప్రేమ్, నిరుపమ్ అని చెప్పారు.

ఈ సీన్ చూస్తుంటే వీరిని దీప, కార్తీక్ అమ్మాయిలు సౌర్య, హిమకు జంట చేసే ఆలోచన ఉన్నట్లు అర్థమవుతున్నది. ఇక మగ పిల్లలిద్దరిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు సౌందర్య, ఆనందరావు. అరే మీరా.. ఇండియాకి ఎప్పుడు వచ్చారు అంటూ వారిని పలకరిస్తారు. స్వప్నక్క పిల్లలు అంటూ వారిని గురించి కార్తీక్, ఆదిత్య, శ్రావ్య, దీపకు పరిచయం చేస్తారు. ఈ క్రమంలోనే మీ అమ్మ ఏది అంటూ సౌందర్య పిల్లలను అడుగుతుంది.

Karthika Deepam 29 Sep Today Episode దీపను అత్త అని పిలిచిన పిల్లలు..
మీ అమ్మకు మాపై, నానమ్మపై ఇంకా కోపం తగ్గలేదా అని సౌందర్య పిల్లలను అడుగుతుంది. ఐ డోంట్ నో అంటూ పిల్లలు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే పిల్లలిద్దరు దీపను అక్కఅత్త అని పిలుస్తారు. అది విన్న హిమ, సౌర్య అదేంటీ వీళ్లు ఇలా పిలుస్తున్నారు.

ఓవర్ చేస్తున్నారని అనుకుంటారు. అయితే, దీప అత్త అచ్చం తమ అక్కలాగా ఉంటుందని, అందుకే అక్క అత్త అని పిలుస్తున్నామని వారు చెప్తారు. ఇకపోతే కార్తీక్‌ను పెదమావయ్య అని పిలిచి మీ పిల్లలేరి అని అడగ్గా, సౌందర్య సౌర్య, హిమను పిలుస్తుంది. వాళ్లు రాగానే వీళ్లు మీకు బావలు అని చెప్తారు. అలా హిమ, సౌర్యకు ప్రేమ్, నిరుపమ్ జంట కాబోతారు భవిష్యత్తులో అని చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలోనే పిల్లలను సౌందర్య, ఆనందరావు ఆశీర్వదిస్తారు.

ఇకపోతే జైల్లో ఉన్న మోనిత సీన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మోనిత -కార్తీక్ ప్రేమ గురించి కథనం వచ్చిన పేపర్‌ను దీప బెడ్ రూంలో దాచేయగా, సౌర్య పరుపు కింద ఉన్న డబ్బులు తీస్తున్న సమయంలో పేపర్ చూస్తుంది. అలా పేపర్లోని మ్యాటర్ చదివి నాన్న నిజంగానే మోనితను మోసం చేశాడా? అని ఏడుస్తున్న సీన్‌తో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.