Karthika Deepam 8 March Today Episode : కార్తీక్, దీప, హిమ.. ముగ్గురికీ డేంజర్.. లోయలో పడి పేలిపోయిన కారు.. కార్తీక్, దీప, హిమ.. ముగ్గురూ చనిపోతారా? శౌర్య ఒంటరిగా మిగిలిపోనుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 8 March Today Episode : కార్తీక్, దీప, హిమ.. ముగ్గురికీ డేంజర్.. లోయలో పడి పేలిపోయిన కారు.. కార్తీక్, దీప, హిమ.. ముగ్గురూ చనిపోతారా? శౌర్య ఒంటరిగా మిగిలిపోనుందా?

Karthika Deepam 8 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 1294 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప.. కార్తీక్ కళ్లు మూయడంతో.. ఎవరు.. నా కళ్లు మూసింది ఎవరు అంటూ దీపతో పరాచకాలు ఆడుతాడు. దీంతో ఎవరు వస్తారు బాబు ఇక్కడికి అంటుంది దీప. కదా.. ఇక్కడికి ఎవరు వస్తారు. ఒక వంటలక్క, ఒక డాక్టర్ బాబు.. అంతే […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 March 2022,10:30 am

Karthika Deepam 8 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 1294 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప.. కార్తీక్ కళ్లు మూయడంతో.. ఎవరు.. నా కళ్లు మూసింది ఎవరు అంటూ దీపతో పరాచకాలు ఆడుతాడు. దీంతో ఎవరు వస్తారు బాబు ఇక్కడికి అంటుంది దీప. కదా.. ఇక్కడికి ఎవరు వస్తారు. ఒక వంటలక్క, ఒక డాక్టర్ బాబు.. అంతే కదా అంటాడు కార్తీక్. ఇలా బయటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి అంటుంది దీప. మరోవైపు అత్తయ్యకు ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తుంది దీప. కానీ.. తనకు ఫోన్ కలవదు. ఇక్కడ సిగ్నల్స్ తక్కువే దీప. ముందు టూర్ ను ఎంజాయ్ చేయి అంటాడు కార్తీక్. ఇంటి మీదికి మనసు లాగుతోందా అంటాడు కార్తీక్. హిమ అలా అనేసరికి నాకు భయం భయంగా ఉంది అంటుంది దీప.

karthika deepam 8 march 2022 full episode

karthika deepam 8 march 2022 full episode

ఏంటి దీప నువ్వు. ప్రతిదానికి మొండి ధైర్యంతో ముందుకు వెళ్తావు. ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటావు. పిల్లలు అలా అన్నారని బాధపడుతున్నావా అంటాడు కార్తీక్. మనం ఇక్కడికి వచ్చింది కష్టాలన్నీ మరిచిపోవడానికే కదా. మనం ఇక్కడ కష్టాలన్నీ మరిచిపోయి.. హ్యాపీగా హైదరాబాద్ వెళ్లాలి సరేనా అంటాడు కార్తీక్. నా వంటలక్క ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఒక్క మాటకే ఇలా భయపడుతుందా? భయపడకూడదు అంటాడు కార్తీక్. నేను బయటికి ఇలా కనిపిస్తున్నాను కానీ.. లోపల పిరికిదాన్నే డాక్టర్ బాబు అంటుంది దీప. నేను మీకు దూరంగా ఉన్నన్నాళ్లు.. చాలాసార్లు చచ్చిపోవాలని అనిపించింది అంటుంది దీప.

నువ్వు, నేను మన ఫ్యామిలీ ఎన్నో అవమానాలను భరించాం. ఇప్పుడు అన్నీ పోయాయి. నాకు నువ్వు.. నీకు నేను.. డాక్టర్ బాబు, వంటలక్క. మనిద్దరి మధ్య మూడో వ్యక్తి లేరు. ఇక రారు కూడా. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆ దేవుడు కూడా అని అంటాడు కార్తీక్.

మరోవైపు శ్రావ్య.. ఆనంద రావు, ఆదిత్యకు కాఫీ ఇస్తుంది. పిల్లలు లేకునే సరికి ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు ఆనంద రావు. పిల్లలు ఉంటే ఆ సందడే వేరేగా ఉండేది అని అంటుంది. వాళ్లు కూడా బయట ప్రపంచం చూడాలి కదా అంటాడు ఆనంద రావు.

ఇంతలో సౌందర్య రెడీ అయి బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఆదిత్య.. ఎయిర్ పోర్ట్ దాకా వెళ్దాం పదా అంటుంది. దీంతో ఎవరు వస్తున్నారు అంటాడు ఆదిత్య. ఎవరూ రావడం లేదు.. నేనే వెళ్తున్నా. పెద్దోడి దగ్గరికి వెళ్తున్నా నేను. నేను వెళ్లి వాళ్లను అక్కడి నుంచి వేరే హిల్ స్టేషన్ కు తీసుకెళ్తా అంటుంది సౌందర్య.

ఎందుకు సౌందర్య.. నువ్వు అక్కడికి వెళ్లి టెన్షన్ పడటం. వద్దు అంటాడు. ఇంతకాలం వాళ్లు పడ్డ కష్టాలు, సమస్యలకు మించి ఇంకేం ప్రమాదం వస్తుంది అంటాడు ఆనంద రావు. అన్నయ్య వాళ్లు ఇప్పుడు పడ్డ కష్టాలకు మించి ఇంకేం వస్తాయి మమ్మీ అంటాడు ఆదిత్య.

వాళ్ల ఫోన్ కూడా కలవడం లేదు అండి అంటుంది సౌందర్య. దీంతో వాళ్ల ఆనందానికి అడ్డు రాకూడదని.. నెట్ వర్క్ కూడా అక్కడ పనిచేయడం లేదు కావచ్చు అంటాడు ఆనంద రావు. తర్వాత ఆదిత్య.. సౌందర్య టికెట్లను క్యాన్సిల్ చేస్తాడు.

Karthika Deepam 8 March Today Episode : కార్తీక్ గురించి మళ్లీ టెన్షన్ పడ్డ సౌందర్య

కట్ చేస్తే.. ఓపెన్ ప్లేస్ లో కార్తీక్, పిల్లలు చలికాచుకుంటూ ఉంటారు. ఇంతకీ వంటలక్క ఏం చేస్తోంది అని అనుకుంటాడు. అక్కడ వంటలు చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్తారు అందరూ. నీ వంటలు నచ్చి మెచ్చి.. వచ్చే జన్మలో కూడా నువ్వే నా భార్యగా రావాలని ఆ దేవుడిని మొక్కుకుంటాను అంటాడు కార్తీక్.

ఓయ్ వంటలక్క చికెన్ స్మెల్ అదిరింది. త్వరగా కానీయ్ అంటుంది హిమ. హేయ్ హిమ.. నన్ను వంటక్క అంటున్నావా.. నీ సంగతి అంటూ తనపై సీరియస్ అవుతుంది దీప. వంటలక్కను వంటలక్క అంటే తప్పేంటి అంటుంది. ఆ తర్వాత కింద పడిపోతుండగా దీపను పట్టుకుంటాడు కార్తీక్.

ఇలా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా వంటలక్క. మళ్లీ జన్మలో నీకు మొగుడిగా కాకపోయినా.. గరిటగా అయినా పుడతాను వంటలక్క అంటాడు. ఐలవ్యూ వంటలక్క అంటాడు. నేను కూడా లవ్యూ అంటుంది దీప. ఆ తర్వాత చికెన్ టేస్ట్ చేసి బాగుంది అమ్మ అంటారు.

ఈ టూర్ వచ్చినందుకు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు డాక్టర్ బాబు అంటుంది దీప. మరి.. నేను హ్యాపీనో కాదో అడగవా అంటాడు కార్తీక్. అంటే.. అంటాడు కార్తీక్. ఇలాంటి వాతావరణంలో నువ్వు ఉండగా.. ఘుమఘుమలాడే చికెన్ ఉండగా.. ఇంకా ఏదో అంటాడు కార్తీక్.

దీంతో ఒక్క నిమిషం ఉండండి అంటుంది. ఇదే కదా అదేదో అని ఒక బాటిల్ తెచ్చి ఇస్తుంది. అందులో మద్యం ఉంటుంది. థ్యాంక్స్ దీప. నువ్వు నన్ను చాలా సర్ ప్రైజ్ చేశావు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆఖరి రోజు అయినా పర్వాలేదు అంటాడు.

దీంతో దీపకు కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు సౌందర్య ఇంకా పూజారి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్రావ్య పాలు తీసుకొస్తుంది. అత్తయ్య పాలు తీసుకోండి అంటుంది. కానీ సౌందర్య వినదు. తర్వాత శ్రావ్యను చూసి వద్దు అంటుంది.

నాకు ఏం తినాలని లేదు.. తాగాలని లేదు అంటుంది సౌందర్య. అప్పుడే ఆనంద రావు వచ్చి అసలు నీ సమస్య ఏంటి అంటాడు ఆనంద రావు. తనకు నచ్చజెప్పుతాడు ఆనంద రావు. ఎంత నచ్చజెప్పినా సౌందర్య మాత్రం వినదు. పిల్లలు బాగుండాలి అని కోరుకున్నప్పుడు వాళ్లు బాగాలేరు.

బాగుండరేమో అని అనుకున్నప్పుడు కలిసి పోయి బాగున్నారు. అలాంటి మాటలు అందుకే మనసులోకి తీసుకోవద్దు అంటాడు ఆనంద రావు. అది కాదండి అంటుంది సౌందర్య. సరే.. పదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటాడు ఆనంద రావు. ఎందుకు అంటుంది శ్రావ్య.

మానసిక సమస్యతో బాధపడుతున్నావు నువ్వు. ఇది హ్యాపీగా ఉండాల్సిన టైమ్. వాడు బయటికి వెళ్లిపోయి ఎన్నో కష్టాలు పడ్డాడు.. అంటాడు. దీంతో వాడికి మళ్లీ ఏ కష్టం వస్తుందోనని భయంగా ఉంది అంటుంది సౌందర్య. నాకెందుకో మనసు ప్రశాంతంగా లేదు అంటుంది.

మరోవైపు సైట్ సీయింగ్ కోసం కార్తీక్, దీప, పిల్లలు అందరూ ఓ ప్లేస్ కు వెళ్తారు. అక్కడ కారు ఆపేసి కార్తీక్ ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇంతలో హిమ కారు ఎక్కి.. డ్రైవర్ సీటులో కూర్చొని రా అమ్మ అని దీపను కూర్చోబెట్టుకొని కారు స్టార్ట్ చేస్తుంది. వద్దు అన్నా కూడా వినదు.

ఆ తర్వాత బ్రేక్ పడదు. కారు వెళ్తుండటం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. వాళ్ల వెంట పరిగెడతాడు. కారును పట్టుకుంటాడు. ఇంతలో రాయికి తగిలి కారు లోయలో పడిపోయి పేలిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది