Bigg Boss Telugu 5: రెండువారాలకి ఉమాదేవి అందుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి

Authored By vamana sai | The Telugu News | Updated on: September 21, 2021, 8:24 am

Bigg Boss Telugu 5: టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ప్రసారం అవుతూ జనాలని టీవికి కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ ఈ షో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. షో మొదలైన రెండు వారాల్లోనే కంటెస్టెంట్లు తమ అసలు రూపాన్ని చూపించేస్తున్నారు. నామినేషన్స్‌ వచ్చేసరికి కంటెస్టెంట్ల రంగు మొత్తం బయటపడుతోంది. లోలోపల అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తున్నారు.

bigg-boss-telugu-5-uma-devi-remuniration-for-two-weeks-is

bigg-boss-telugu-5-uma-devi-remuniration-for-two-weeks-is

ఈ క్రమం‍లో తమను నామినేట్‌ చేసిన వ్యక్తులను నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తిక దీపం ఫేమ్‌ ఉమాదేవి. గతవారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో నోటికొచ్చినట్టు బూతులను మాట్లాడేసింది. ఆ బూతులకు బిగ్‌బాస్‌ బీప్‌ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ కి చికాకు తెప్పించాయి. దీంతో ఉమాదేవికి పడాల్సిన ఓట్లు చాలావరకు తగ్గిపోయాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకునేలోపే ఉమాదేవీ రెండోవారంలోనే హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది.

Bigg Boss Telugu 5: ఉమదేవి గయ్యాళి అనే పేరుతోనే హౌస్‌ నుంచి బయటకు వెళ్లడం స్వయం కృపరాదం అంటున్నారు.

హౌజ్ మెట్ లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నప్పటికీ, నామినేషన్‌ ప్రక్రియలో ఆమె బూతులు మాట్లాడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు ఉమాదేవి బిగ్‌బాస్‌ షోలో కంటిన్యూ అయ్యేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు గయ్యాళి అనే పేరు నుంచి తనెలాంటిదో నిరూపించుకుందాం అనుకున్న ఉమాదేవి..అవకాశం లేకుండా పోయి చివరికి గయ్యాళి అనే పేరుతోనే హౌస్‌ నుంచి బయటకు వెళ్లడం తన స్వయం కృపరాదం అంటున్నారు. కాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషకాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన రెండు వారాలకు గాను ఆమెకు సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp