Uma devi : ‘బిగ్ బాస్’ ఉమాదేవి కూతురికి అక్కడ ఫుల్ క్రేజ్.. ఆమె ఏం చేస్తోందంటే?
Uma devi : క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమాదేవి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, ఈమె తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంకా బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నప్పటికీ ఉమాదేవికి ఒకే ఒక్క షో ద్వారా క్రేజ్ అమాంతం పెరిగింది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఉమాదేవి.. ‘కార్తీక దీపం’ సీరియల్‌లోనూ నటిస్తోంది.బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో ఒకటైన ‘కార్తీకదీపం’లో వంటలక్క దీపకు బంధువు పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది ఉమాదేవి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫైవ్‌లో చాలా తక్కువ టైంలోనే ఎలిమినేట్ అయిన ఉమా దేవికి సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ పెరిగింది.

uma devi got full popularity with big boss reality show
‘బిగ్ బాస్’లో పార్టిసిపేషన్ తర్వాత ఉమాదేవికి నెట్టింట బాగా క్రేజ్ వచ్చింది. ఉమాదేవి తన కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమాని ఉమాదేవి కుటుంబ సభ్యుల విషయాలు నెట్టింట బయటకు వచ్చేశాయి. ఇటీవల ఉమాదేవి తన కూతురితో దిగిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఉమాదేవి డాటర్ యాగంటి అనూష..ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటుందట. ఇకపోతే అనూషకు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది. ఆమెకు దాదాపు 5 వేల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, ఉమాదేవి కూతురు ఫ్యూచర్‌లో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ట్రై చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆమె ఫొటోలు చూసిన నెటిజన్లు అంటున్నారు.
Uma devi : ఉమాదేవి తన కూతురితో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్..

uma devi got full popularity with big boss reality show
ఆల్రెడీ మదర్ ఉమాదేవి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంది కాబట్టి అనూషకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి కొంచెం ఈజీ సిచ్యువేషన్సే ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి.. అనూష తన తల్లి మాదిరిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా సక్సెస్ అవుతుందో లేదో.. ఇంతకు హీరోయిన్‌గా రావడానికి ఆమెకు ఇష్టం ఉందో లేదో..