Sri Reddy : కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచలన పొస్ట్..!
Sri Reddy : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కత్తి మహేశ్ మృతి గురించే చర్చ. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆయన చనిపోవడం పక్కన పెడితే.. ఆయన మృతిపై కొందరు పాజిటివ్ గా కొందరు నెగెటివ్ గా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా కత్తి మహేశ్ యాక్సిడెంట్ గురించి.. ఆయన మృతి గురించి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. గత నెల కారు యాక్సిడెంట్ అవడంతో.. చెన్నై ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న కత్తి మహేశ్.. నిన్న అంటే శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

sri reddy post on kathi mahesh death
కత్తి మహేశ్ మృతికి చాలామంది సెలబ్రిటీలు తమ సంతాపం ప్రకటించారు. అయితే.. కొందరు మాత్రం ఆయన చావుపై కూడా రాద్దాంతం చేస్తున్నారు. కొందరు ఆయన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది.. అంటూ కత్తి మహేశ్ పై విమర్శలు గుప్పించారు. అయితే.. కత్తి మహేశ్ మృతిపై ప్రముఖ నటి శ్రీరెడ్డి స్పందించింది. తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.
Sri Reddy : అందరూ వెనకా ముందు పోవాల్సిందే
కత్తి మహేశ్ చనిపోయిన తర్వాత ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. అందరూ ముందూ వెనక పోవాల్సిన వాళ్లే. కత్తి మహేశ్ మరణాన్ని పండగలా చెప్పుకునే వాళ్లకి, అపహాస్యం చేసేవాళ్లకు ఇదే నా సమాధానం. రేపో ఎల్లుండో.. మీరు కూడా పోవాలి.. మీ హీరో కూడా పోతాడు. మీరేదో యుగపురుషులు అని అనుకుంటున్నారా? ఎందుకురా మీకు పోజులు? బుర్ర అప్పుడప్పుడు వాడండి. ఆయన ఆత్మను ప్రశాంతంగా ఉండనీయండి.. అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.

sri reddy post on kathi mahesh death
కత్తి మహేశ్ కు, శ్రీరెడ్డి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాడిన సమయంలో.. కత్తి మహేశ్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇద్దరూ కలిసి కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమించారు. ఈనేపథ్యంలో ఆయన మరణించిన తర్వాత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.

sri reddy post on kathi mahesh death
ఇది కూడా చదవండి ==> గు.. అంటూ అనసూయ బూతు మాట.. షాకైన అభి,రోజా.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> బ్లాక్ బస్టర్ ఎవడు మూవీ ఏ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటబోయిన సిరి, శ్రీహాన్.. హేయ్ అంటూ అడ్డుకున్న యాంకర్ సుమ.. వైరల్ వీడియో !
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ నరేష్ ఏజ్ ఎంతో తెలిస్తే షాకవుతారు..ఇతను జూనియర్ కాదు చాలా సీనియర్..!