Karthika Deepam : దంచికొట్టేసిన కార్తీకదీపం హిమ.. సహృద వీడియోలు వైరల్
Karthika Deepam కార్తీకదీపం సీరియల్ వల్ల ఎంతో మందికి పాపులారిటీ వచ్చింది. ఒక్క సీరియల్ నుంచి ఎన్నో పాత్రలు ఫేమస్ అయ్యాయి. తద్వారా ఆ పాత్రలను పోషించిన నటీనటులకు ఎంతో పేరు వచ్చింది. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రల్లో నిరుపమ్.. వంటలక్క, దీపగా ప్రేమీ విశ్వనాథ్ ఫేమస్ అయ్యారు. ఇక సీరియల్‌లోని ప్రతీ పాత్ర దాదాపుగా పాపులర్ అయింది.

Karthika Deepam Hima Fame Sahruda Dance Video
అందులో హిమ, శౌర్య అని చిన్న పిల్లల పాత్రలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అయితే ఒకప్పుడు ఈ ఇద్దరూ చిన్న పిల్లల్లా ఉండేవారు. ఇప్పుడు కాస్త పెద్దయ్యారు. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. సీరియల్‌లో కనిపించే దానికి.. సోషల్ మీడియాలో వీరూ చేసే దానికి అస్సలు పోలీకే ఉండదు. మరీ ముఖ్యంగా హిమను అయితే అస్సలు గుర్తు పట్టరు.
Karthika Deepam : డ్యాన్సులతో హిమ హల్చల్..
హిమ పాత్రకు తగ్గట్టుగా కాస్త డార్క్ మేకప్ ఉంటుంది. హిమ పాత్రలో సహృద అదరగొట్టేస్తుంది. సోషల్ మీడియాలో సహృద చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. డ్యాన్సులతో సహృద అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఇంతకు ముందు డ్యాన్స్ షోలోకూడా పాల్గొంది. సహృదకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం. తాజాగా ఆమె షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram