Karthika Deepam Monitha : అతడితో ‘కార్తీక దీపం’ ఫేమ్ మోనిత పెళ్లి..?
Karthika Deepam Monitha : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో బాగా పాపులర్ అయిన సీరియల్ ‘కార్తీక దీపం’. ఈ సీరియల్‌లోని పాత్రల గురించి ప్రతీ ఇంట్లోని గృహిణులు చర్చించుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రదారులైన డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్, వంటలక్క దీపకు ఎంత పాపులారిటీ ఉందో అంతే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని పాపులారిటీ సంపాదించుకుంది మోనిత. ఈమె అసలు పేరు శోభాశెట్టి.ఉభయ తెలుగు రాష్ట్రాలలో మోనిత గురించి తెలియని వారుండరని చెప్పొచ్చు. ‘కార్తీక దీపం’ సీరియల్‌లో లేడీ విలన్‌గా మోనిత బాగా పాపులర్. శాండల్ వుడ్ అనగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన మోనిత అలియాస్ శోభాశెట్టి త్వరలో ఓ ఇంటి ఆవిడ కాబోతున్నదన్న వార్త తెలుస్తోంది.

karthika deepam monitha marrigae news
కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి పాపులర్ అయిన శోభా శెట్టి తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటిస్తోంది. కాగా, ‘కార్తీక దీపం’ సీరియల్ ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రతీ ఇంటికి చేరిపోయింది శోభా శెట్టి. అయితే, సీరియల్‌లో మాదిరిగా రియల్ లైఫ్‌లో ఆమె సాడిస్టు కాదండోయ్. ఈ సంగతులు పక్కనబెడితే నెట్టింట ప్రచారంలో ఉన్న వార్త ప్రకారం.. శోభాశెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. అయితే, శోభా శెట్టి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు, అతని పేరేంటి? ఏం చేస్తాడు అనే వివరాలు పూర్తిగా తెలియరాలేదు.
Karthika Deepam Monitha : సీరియల్ నటుడితో మోనిత మ్యారేజ్.. !

karthika deepam monitha marrigae news
కానీ, కొందరు ప్రచారం చేస్తున్న వివరాల ప్రకారం కన్నడ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన ఓ సీరియల్ నటుడిని మోనిత పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇకపోతే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎపిసోడ్‌లో మోనిత ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉంది. నిండు గర్భిణి అయిన మోనితకు నొప్పులు రాగా పోలీసులు ఆస్పత్రికి తరలిస్తారు. అయితే, మోనతి పరిస్థితి గురించి భారతి డాక్టర్ బాబు కార్తీక్‌కు చెప్పినప్పటికీ కార్తీక్ తనకు ఆ విషయంతో సంబంధం లేదని చెప్తాడు.