Keerthy Suresh : ‘ఆ అబ్బాయి నాకు చాలా స్పెషల్ ‘ కాబోయే వాడి గురించి ఓపెన్ అయిపోయిన కీర్తి సురేష్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : ‘ఆ అబ్బాయి నాకు చాలా స్పెషల్ ‘ కాబోయే వాడి గురించి ఓపెన్ అయిపోయిన కీర్తి సురేష్ ?

 Authored By prabhas | The Telugu News | Updated on :23 May 2023,6:00 pm

Keerthy Suresh ; ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల గురించి ఏదో ఒక వార్త నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ బ్యూటీ కీర్తీ సురేష్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్ గా కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ అబ్బాయి తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇక అప్పటినుంచి కీర్తి సురేష్ కి కాబోయే భర్త అతడే అంటూ నానారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటూ పెళ్లి డేట్ కూడా ఖరారు చేసేశారు.

Keerthy Suresh open up about relati0nship with a boy

Keerthy Suresh open up about relati0nship with a boy

దీంతో విసిగిపోయిన కీర్తి సురేష్ ఈ పుకార్లన్నింటికి చెక్ పెట్టేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ని నా మ్యారేజ్ విషయంలోకి లాగుతారా అని ఘాటుగా స్పందించింది. అంతేకాదు దీనిపై ఓ ట్వీట్ చేస్తూ అందరికి ఇచ్చిపడేసింది. హ హ ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ని ఈ వార్తల్లోకి లాగ్గేసారా .. నిజమైన మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తాను ఆగండి సమయం రావాలి. అప్పటివరకు చిల్ గా ఉండండి అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. దీంతో కీర్తి సురేష్ లైఫ్ లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ గా ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే ఫోటోలో ఉన్న వ్యక్తి తన ఫ్రెండ్ అని చెప్పడంతో జనాలలో సగం టెన్షన్ పోయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఆ అబ్బాయితో దిగిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. చూడడానికి జంట బాగుందని, ఈడు జోడు చక్కగా ఉందని, అతడిని పెళ్లి చేసుకో అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ ఇటీవల ‘ దసరా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందింది. వసూళ్ల పరంగా కూడా రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో నటించింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది