Keerthy Suresh : ‘ట్రోల్ చేసే వారికి ఒక్కటే చెబుతున్నా… కీర్తి సురేష్
Keerthy Suresh : తమిళ బ్యూటీ కీర్తి సురేష్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ డం అందుకున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ కి మొదటి సినిమా ‘ గీతాంజలి ‘. తెలుగులో మొదటి సినిమా ‘ నేను శైలజ ‘. 2013 నవంబర్లో హీరోయిన్గా అవతారం ఎత్తారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. ముఖ్యంగా తెలుగు యూత్ ను తన […]
Keerthy Suresh : తమిళ బ్యూటీ కీర్తి సురేష్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ డం అందుకున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ కి మొదటి సినిమా ‘ గీతాంజలి ‘. తెలుగులో మొదటి సినిమా ‘ నేను శైలజ ‘. 2013 నవంబర్లో హీరోయిన్గా అవతారం ఎత్తారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. ముఖ్యంగా తెలుగు యూత్ ను తన నటనతో తన వైపుకు తిప్పుకున్నారు. అప్పటినుంచి వరుస అవకాశాలు అందుకుంటున్న కీర్తి సురేష్ కి ‘ మహానటి ‘ సినిమా తిరుగులేని ఇమేజ్ ను అందించింది.
కీర్తి సురేష్ ను తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచింది ఆ మహానటి. ఆమె కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే మహానటి అని చెబుతారు. అంతేకాకుండా ఈ సినిమాతో ఉత్తమ జాతీయ నటిగా కూడా అవార్డును అందుకున్నారు. అయితే తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా అడుగుపెట్టి పదేళ్ళు అవుతున్న సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. తనను సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. అలాగే దర్శక నిర్మాతలు, అభిమానులు, మీడియా వాళ్లందరికీ తనని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్ అని చెప్పారు.
ఇండస్ట్రీకి హీరోయిన్గా వచ్చి పదేళ్లు అవుతుందని, నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని, మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేస్తాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. అలాగే తనని ట్రోల్ చేసిన వారికి కూడా కీర్తి సురేష్ సమాధానం ఇచ్చారు. మనం అందరికీ నచ్చాలని ఏమీ లేదు. నన్ను ట్రోల్ చేసిన వారిని కూడా నేను గౌరవిస్తాను, వారికి కూడా చాలా థాంక్స్ అని కీర్తి సురేష్ కూల్ గా ట్రోలర్స్ కి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా కీర్తి సురేష్ కి అభిమానులు విషెస్ తెలియజేశారు.