Amar shashank : కేసులో చిక్కుకున్న ‘కోయిలమ్మ’ నటుడు.. ఇంట్లోకి వెళ్లి యువతిపై దౌర్జన్యం!
Amar shashank : ఒక్కోసారి ఒక్కో వ్యవహారం ఎటు వైపు మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని సార్లు కేసుల్లో చిక్కుకున్న వారి వల్ల సినిమా పేర్లు, సీరియళ్ల పేర్లు హల్చల్ అవుతుంటాయి. అలా ఇప్పుడు కోయిలమ్మ సీరియల్ బాగా ట్రెండ్ అవుతోంది. దానికి సపరేట్ కారణాలు కూడా ఉన్నాయి. కోయిలమ్మ సీరియల్‌లో సమీర్ పాత్రను పోషించిన అమర్ ఇప్పుడు ఓ కేసులో చిక్కుకున్నాడు.

Amar shashank : Koilamma fame Amar shashank In Dispute
కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ వివాదంలో చిక్కుకున్నాడు. తాగిన మైకంలో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడనే ఆరోపణపై అమర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రాత్రివేళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశాడని, తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ శ్రీ విద్య అనే అమ్మాయి కేసు నమోదు చేసింది.
అంతే కాకుండా అమర్‌తో పాటు ముగ్గురు ఆకతాయిలు.. అమర్ ప్రేయసి స్వాతి తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని శ్రీ విద్య ఆరోపించింది . అమర్, స్వాతిల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ శ్రీవిద్యతో పాటు అపర్ణ అనే మరో యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వద్ద ఐదు లక్షల నగదు తీసుకున్నారని తిరిగి అడిగినందుకు తమపై దౌర్జన్యం చేశారంటూ శ్రీ విద్య, అపర్ణలు ఆరోపిస్తున్నారు.
అయితే అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. స్వాతి, అపర్ణ, శ్రీవిద్యలు ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తున్నారని అందులో బేదాభిప్రాయాలు రావడంతో వ్యవహారం ఇంత వరకు వచ్చిందని తెలుస్తోంది. అయితే అమర్ సైతం శ్రీవిద్యపై తిరిగి కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.