Koratala Siva : ఒక్క సినిమా ఫ్లాప్‌తో అంతా అయోమయం..?
Koratala Siva : ఒకే ఒక్క సినిమా ఎంత పెద్ద దర్శకుడి జీవితాన్నైనా తారుమారు చేస్తుంది. దీనికి ఉదాహరణ ఇటీవల ఆచార్య సినిమా, ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ. ప్రముఖ దర్శక రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళి వద్ద రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన కొరటాల ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ప్రభాస్ – అనుష్క శెట్టి – రీచా గంగోపాధ్యాయ ప్రధాన పాత్రల్లో మిర్చి సినిమాను రూపొందించిన కొరటాల దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో మహేశ్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు భారీ హిట్ సాధించాయి. దాంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సమంత – నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించి మరో భారీ హిట్ కొట్టాడు.
ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కొరటాల మరోసారి సూపర్ స్టార్ మహేశ్ తో భరత్ అనే నేను సినిమాను పొల్టికల్ అండ్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించి సాలీడ్ హిట్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు రాజమౌళి తర్వాత కొరటాలనే. అందుకే, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య అంటూ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అంతేకాదు, నాలుగేళ్ళ శ్రమ ఒకే ఒక్క షోతో గాల్లో కలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఆచార్య అట్టర్ ఫ్లాప్ సినిమాగా మిగిలింది. దాంతో అందరూ దర్శకుడు కొరటాల శివనే కామెంట్స్ చేశారు. కథలో మెగాస్టార్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తెలిసినా కూడా నిందలు మాత్రం కొరటాల మోశారు.
దాని ఫలితంగా ఎన్.టి.ఆర్ సినిమా విషయంలో ఇప్పటికే, రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆచార్య ఫ్లాప్ అయినందుకు తన రెమ్యునరేషన్‌లో సగభాగం తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడేమో తారక్ సినిమా కోసం అంతగా శ్రమిస్తున్నా కూడా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది. దీంతో నెటిజన్స్ కొరటాల మీద బాగా సానుభూతి చూపిస్తున్నారు. అయ్యో పాపం కొరటాలకు ఒక్క ఆచార్య ఫ్లాప్ తలకిందుకు చేసేసిందే అంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడు కూడా ఒక్క ఫ్లాప్ వస్తే మళ్ళీ అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తప్పదని ఉదాహరణగా చెప్పడానికి కొరటాల శివనే అని క్లియర్ గా తెలుస్తుంది.