Kota Srinivasa rao : కోట శ్రీనివాసరావుకి మరీ అంత తక్కువా.. ఆయన రెమ్యూనరేషన్ ఎంతంటే?
Kota Srinivasa rao : తెలుగు ఇండస్రీలోని నట సామ్రాజ్యంలో ఆయన కోట చెక్కుచెదరదు. ఎలాంటి పాత్రనైన అవలీలగా పోషించగల విలక్షణ నటుడు. కామెడీ చేసిన నవ్విస్తే పొట్టచెక్కలు కావాల్సిందే.. భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించి అందరినీ గడగడలాడించేయగలడు. అలాంటి కోట శ్రీనివాస రావు ఇప్పుడు వయోభారంరీత్యా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ కరోనా, లాక్డౌన్ మూలానా మరింత ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో పని చేయాలన్న కోరిక పుట్టిందట.

Kota Srinivasa rao about his remuneration
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, త్రివిక్రమ్ వంటి వారికి ఫోన్ చేసి మరీ అవకాశాలు అడిగాడట. అందులో భాగంగా క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం నటించానని, అలా రెండు రోజులు వెళ్లి నటించేసి వచ్చానని చెప్పుకొచ్చాడు. అలా ఎవరైనా పిలిస్తే వెళ్లి నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, డబ్బుల కోసం కాదని, ఇంట్లో ఉంటూ బోర్ కొట్టింది.. నిత్యం వంద రెండొందల మంది మధ్య గడిపిన ప్రాణం కదా? ఇంట్లో ఇలా కూర్చుని ఉండాలంటే బోర్‌గా ఉందని చెప్పుకొచ్చాడు.
కోట శ్రీనివాసరావుకి మరీ అంత తక్కువా..
అయితే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పాడు. తానేమీ ఎక్కువగా సంపాదించలేదని, ఓ తృప్తి ఉండాలని అది తనకు ఉందని అన్నాడు. ఏనాడూ కూడా ఎవ్వరినీ ఇంత ఇమ్మని అడగలేదని తెలిపాడు. తనకు ఇంత వరకు వచ్చిన హయ్యస్ట్ రెమ్యూనరేషన్ లక్షన్నర అంటూ అసలు విషయం చెప్పేశాడు. అయితే కోట లాంటి ఆర్టిస్ట్ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ లక్షన్నరేనా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.