Getup Srinu : సుమన్ టీవీ యాంకర్ రోషన్‌కు ఎదురుదెబ్బలు.. గెటప్ శ్రీను, కృష్ణ భగవాన్‌లు ఆడుకున్నారుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Getup Srinu : సుమన్ టీవీ యాంకర్ రోషన్‌కు ఎదురుదెబ్బలు.. గెటప్ శ్రీను, కృష్ణ భగవాన్‌లు ఆడుకున్నారుగా

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2022,3:20 pm

Getup Srinu : సుమన్ టీవీ యాంకర్ రోషన్‌కు ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. చిరంజీవి లాంటివాడే పొగడటంతో రోషన్ ఫాలోయింగ్, ఇమేజ్ పెరిగింది. అప్పుడప్పుడు బుల్లితెరపైకి కూడా వస్తుంటాడు. జబర్దస్త్ షోలో కనిపిస్తుంటాడు. తాజాగా రోషన్ వినాయక చవితి ఈవెంట్లో సందడి చేశాడు. ఈటీవీ ఈ వినాయక చవితికి మన ఊరి దేవుడు అనే ఈవెంట్‌ను చేస్తోంది. ఇందులో కృష్ణ భగవాన్, నాగినీడు, ఇంద్రజ వంటి వారు వచ్చారు. షోను ముందుకు నడిపించారు. అయితే ఈ ఈవెంట్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే రెండు ప్రోమోలో కట్ చేసి వదిలారు. వాటితో ఈవెంట్ మీద అందరికీ అంచనాలు పెరిగాయి. అయితే వినాయక చవితి అన్నారు గానీ అందులో గణేషుడి సంబరాలు మాత్రం చూపించడం లేదు.

తాజాగా వదిలిన ప్రోమోలోనూ అవే జోకులు కనిపించాయి. కానీ ఈ మూడో ప్రోమోలో మాత్రం రష్మీ డ్యాన్స్ అందరినీ కట్టిపడేసింది. చివరగా చూపించిన రోషన్ ఇంటర్వ్యూ స్కిట్ బాగా పేలింది. అందులో రోషన్ మీద కృష్ణ భగవాన్, గెటప్ శ్రీనులు పంచుల వర్షం కురిపించారు. దీంతో ఏం చేయాలో రోషన్‌కు పాలు పోలేదు. రోషన్ నా షో అంటూ తన ఇంటర్వ్యూని మొదలుపెట్టాడు. కృష్ణ భగవాన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించారు. మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? అని రోషన్ అడిగేశాడు. దానికి కృష్ణ భగవాన్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. నా తోటి ఆర్టిస్టులు బాగా చేయకపోవడం అని కౌంటర్లు వేశాడు. దీంతో అందరూ పగల బడి నవ్వేశారు.

Krishna Bhagawan Getup Srinu Satires on Suman TV Anchor Roshan in Mana Oori Devudu Event

Krishna Bhagawan Getup Srinu Satires on Suman TV Anchor Roshan in Mana Oori Devudu Event

ఇక గెటప్ శ్రీను వచ్చి కాంట్రవర్సీకి తెరలేపే ప్రయత్నం చేశాడు. పెద్ద వాళ్లకు కనీసం గౌరవం ఇవ్వాలని నీకు తెలీదా? అంటూ రోషన్‌ను నిలదీశాడు గెటప్ శ్రీను. ఇది నా షో అని చెప్పారు.. అని రోషన్ అనడం.. నీ షో కాదు ఈవెంట్ ఇది అంటూ గెటప్ శ్రీను,రోషన్‌ల మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగింది. ఇదంతా కూడా ప్రోమో కోసం కట్ చేసిందేనని అర్థమవుతోంది. ఎపిసోడ్స్‌లో ఇంత సీరియస్ నెస్ ఉండదని అందరికీ తెలిసిందే. మొత్తానికి రోషన్‌ను మాత్రం రోస్ట్ చేసేశారు. క‌ష్ణ భగవాన్ టైమింగ్ చూసి నెటిజన్లు ఇలా కామెంట్లు పెడుతున్నారు. ‘జబర్థస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి కూడా జడ్జ్ గా కృష్ణ భగవాన్ గార్ని పిలవండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కగా ఉంటుంది , కృష్ణ భగవాన్ గారు ఆ పంచింగ్ టైమింగ్ ఏంటండీ బాబు మెంటల్ మాస్ తెప్పిస్తున్నారు, క్రిష్ణ భగవాన్ గారు కామెడీ టైమింగ్ సుాపర్, జబర్దస్త్ షోకి కృష్ణ భగవాన్ గారిని జడ్జీగా కొనసాగిస్తే బాగుంటుంది అని అంటున్నారు.

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది