Krishna Bhagawan : ఇంద్రజ పరువుతీసేశాడు.. స్కిట్ల మధ్యలే చేసే పని అదేనా?.. కృష్ణ భగవాన్ మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna Bhagawan : ఇంద్రజ పరువుతీసేశాడు.. స్కిట్ల మధ్యలే చేసే పని అదేనా?.. కృష్ణ భగవాన్ మామూలోడు కాదు

 Authored By aruna | The Telugu News | Updated on :11 September 2022,4:00 pm

Krishna Bhagawan : బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు జబర్దస్త్ జిమ్మిక్కులు అందరికీ తెలిసేవి కావు. కొన్ని సార్లు జడ్జ్‌లు లేకపోయినా కూడా షోలను నడిపించేవారట. గతంలో తీసిన షాట్స్, నవ్వుల వీడియోలను స్కిట్ల మధ్యలో పెట్టి మ్యానేజ్ చేసేవారట. ఈ విషయాలన్నీ ఆ తరువాత చాలా మంది చెప్పారు. ఓ సారి రాకేష్ మాస్టర్ కూడా దీనిపై మాట్లాడాడు. జబర్దస్త్ జడ్జ్‌లని అంటారు.. కానీ వాళ్లు కొందరి స్కిట్లు కూడా చూడరు.. చివరన వచ్చే వారి స్కిట్లు కూడా చూడకుండా వెళ్లిపోతారట. ఆ తరువాత ఎడిటింగ్‌లో కలిపేసుకుంటారట.

పెద్ద పేరున్న టీంలు స్కిట్లు చేస్తున్నా కూడా ఫోన్‌లో ఏదో ఒకటి నొక్కుకుంటూ ఉంటారట. రోజా అయితే ఎప్పుడూ ఫోన్‌లోనే బిజీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. జబర్దస్త్ షో నుంచి రోజా వెళ్లిపోయింది. మంత్రి పదవి రావడంతో ఈ షోకు మంగళం పాడింది. ఇక ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చింది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తుండటంతో.. శ్రీదేవీ డ్రామా కంపెనీని వదిలేసింది ఇంద్రజ. అలా చివరకు ఇంద్రజ జడ్జ్‌గా ఫిక్స్ అయింది.

Krishna Bhagawan Satires on Indraja Judgement in Latest Jabardasth Promo

Krishna Bhagawan Satires on Indraja Judgement in Latest Jabardasth Promo

అయితే రెండో జడ్జ్ కోసం బాగానే ట్రై చేసింది జబర్దస్త్ టీం. మొత్తానికి కృష్ణ భగవాన్‌ను జడ్జ్‌గా తీసుకొచ్చి పెట్టేసింది. కృష్ణ భగవాన్ కంటెస్టెంట్లు, టీం లీడర్ల మీదే కాదు.. ఇంద్రజ మీద కూడా సెటైర్లు వేసేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంద్రజ పరువుతీసేశాడు. స్కిట్ అనంతరం ఇంద్రజ తన స్టైల్లో జడ్జ్మెంట్ ఇచ్చింది. మీరు స్కిట్లు ఎక్కడ చూశారు.. మొత్తం ఫోన్ చూస్తూనే ఉన్నారు కదా? అని పరువుతీసేశాడు కృష్ణ భగవాన్. దీంతో ఇంద్రజ తలపట్టేసుకుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది