Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత.. శోక సంద్రంలో ప్రభాస్ ఫ్యామిలీ
Krishnam Raju : ప్రముఖ నటుడు, నిర్మాత, నాటి తరం హీరో కృష్ణంరాజు హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెబల్ స్టార్ వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణ వార్తతో టాలీవుడ్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగింది. […]
Krishnam Raju : ప్రముఖ నటుడు, నిర్మాత, నాటి తరం హీరో కృష్ణంరాజు హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెబల్ స్టార్ వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణ వార్తతో టాలీవుడ్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగింది. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్ట్రీ అన్నారు. హీరో ప్రభాస్ కూడా కృష్ణంరాజు సోదరుడి కుమారుడు కావడం విశేషం.
కృష్ణం రాజు చిరకాలంగా ఇంటికే పరిమితం అయ్యారు. రాధేశ్వామ్ సినిమాలో ఓ కీలకపాత్రను పోషించారు. ఇది కేవలం ప్రభాస్ తన పెదనాన్న మీద అభిమానంతో ప్రత్యకంగా తీసుకున్న నిర్ణయం. కోవిడ్ టైమ్ లో కూడా కృష్ణం రాజు ఒకటి రెండు సార్లు అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయి, నాలుగైదు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. కృష్ణం రాజు జనవరి 20, 1940న జన్మించాడు. 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు.
Krishnam Raju : నివాళులు..
కృష్ణంరాజుకు జీవితబాగస్వామి పేరు శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు . 1966లో చిలకా గోరింకా చిత్రంతో ఆయన సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ సినీ పిరశ్రమ షాక్‌కి గురైంది. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఐదున్నర దశాబ్దాల కెరియర్‌లో బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీసావిత్రి, పల్నాటి పౌరుషం, తాతామనవడు, టూటౌన్ రౌడీ తదితర 187 సినిమాల్లో నటించారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు.