Krishnam Raju : కథ వినకుండా కృష్ణం రాజు నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా?
Krishnam Raju : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణం రాజు. దాదాపు 183 సినిమాలలో నటించిన కృష్ణం రాజు తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు..ఈయన 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు.1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో హీరోగా సినీరంగప్రవేశం చేశారు.
ఎన్ టి .ఆర్, ఎ.ఎన్ ఆర్ తర్వాత రెండోతరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు తర్వాత తనకంటూ గుర్తుంపును, స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణంరాజు. తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్. 1976లో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాలో కృష్ణం రాజు నటించి తన నట విశ్వరూపం చూపించాడు. శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథతో తెరకెక్కించారు.సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమ భక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లుగా కృష్ణంరాజు తన నటన నైపుణ్యాన్ని తెరముందు ప్రదర్శించారు.
krishnam raju perfect actor
Krishnam Raju : రెబల్ స్టార్‌కే సాధ్యం..
1987లో కృష్ణం రాజు నటించిన కటకటాల రుద్రయ్య సినిమా విడుదలైంది. కృష్ణంరాజు సినిమాల గురించి ప్రస్తావించాల్సి వస్తే కటకటాల రుద్రయ్య కచ్చితంగా ఉండాల్సిందే. అప్పట్లో ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్‌ను రాబట్టగలిగింది. కథ కూడా వినకుండా కృష్ణంరాజు నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే. దాసరి నారాయణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో కటకటాల రుద్రయ్య బాక్సాఫీస్‌ని ఉపేసింది. నిన్నటితరానికే కాదు, నేటి తరానికి కూడా సుపరిచితులు కృష్ణంరాజు. ప్రభాస్ పెదనాన్నగా, సీనియర్ రెబల్ స్టార్‌గా ఆయనకు జనాల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ నటించిన బిల్లాలో స్పెషల్ కేరక్టర్ చేశారు కృష్ణంరాజు.