Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెళ్లి విషయమై క్లారిటీనిచ్చిన కృష్ణంరాజు
Prabhas : ‘బాహుబలి’ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. కాగా ఆ సినిమా తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ బాగా పెరిగిపోయింది. అప్పటి వరకు టాలీవుడ్ రెబల్ స్టార్‌గా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఉన్న ప్రభాస్‌కు బోలెడు మంది అభిమానులున్నారు. ఇకపోతే ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా ఆయన సినిమాల కోసం వెయిట్ చేయడంతో పాటు ఆయన మ్యారేజ్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు గుడ్ న్యూస్ చెప్పారు.

krishnam raju said good news to prabhas fans
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌గా ఉన్నటువంటి నిఖిల్, రానా, నితిన్ గతేడాది మ్యారేజ్ చేసుకోగా, ప్రభాస్ మాత్రం బ్యాచ్‌లర్‌గానే ఉండిపోయారు. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా బ్యాచ్‌లర్‌గానే ప్రభాస్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మ్యారేజ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడారు. ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే సినిమాలున్నాయని, దాంతో ప్రభాస్ ఫోకస్ మొత్తం మూవీస్‌పైనే ఉందని, ఆ ప్రాజెక్టులు పూర్తి కాగానే ప్రభాస్ మ్యారేజ్ గ్రాండ్‌గా చేస్తామని చెప్పారు.
Prabhas : మేము చూసిన అమ్మాయితోనే ప్రభాస్ మ్యారేజ్..: కృష్ణంరాజు

prabhas
ప్రభాస్‌కు ఇండస్ట్రీ అమ్మాయి కాకుండా బయట వాళ్ల అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేస్తామని, ఆ అమ్మాయిని తాము చూస్తామని కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. తాము చూసిన అమ్మాయిని ప్రభాస్ మ్యారేజ్ చేసకుంటాడని వివరించాడు కృష్ణంరాజు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ వచ్చే వార్తలను నమ్మొద్దని కృష్ణంరాజు కోరాడు. ప్రభాస్ ప్రేక్షకులకు చివరగా యాక్షన్ డ్రామా ‘సాహో’చిత్రంలో కనిపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ ఫిల్మ్ జనవరి 14న విడుదల కానుంది. రాధా కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరిలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’గా, పూజా హెగ్డే ‘ప్రేరణ’గా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నాడు.