Prabhas : ప్రభాస్, అనుష్క పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు భార్య
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి విషయం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఆయన పెళ్లి గురించి ప్రతి రెండు నెలలకోసారి ఓ న్యూస్ బయటికి వస్తూనే ఉంటుంది. ప్రభాస్ 40ప్లస్ లోకి ఎంటర్ కావడంతో ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. బాహుబలి చిత్రం కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన ప్రభాస్… విడుదల వెంటనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. 2017లో బాహుబలి 2 విడుదల కాగా… మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పట్లో ప్రభాస్, అనుష్క రిలేషన్షిప్ లో ఉన్నారని, వారు పెళ్లి చేసుకోవడం లాంఛనమే అన్న పుకార్లు చెలరేగాయి. పలు సందర్భాల్లో అనుష్క, ప్రభాస్ లకు ఈ ప్రశ్న ఎదురైంది.
అయితే ప్రతిసారి వీరిద్దరు తిరస్కరించారు.రాధే శ్యామ్ ప్రమోషన్ సమయంలోను ప్రభాస్ పెళ్లికి సంబంధించి వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ప్రభాస్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాజాగా ఆ విషయమే చెప్పుకొచ్చింది ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు భార్య శ్యామల దేవి. ఓ ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..” ప్రభాస్ కి మన పద్ధతులు అన్నా, సాంప్రదాయాలు అన్నా చాలా ఇష్టం ..గౌరవం. మహిళంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. కుటుంబానికి కుటుంబ విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు” అంటూ చెప్పుకొచ్చింది. అలానే ప్రభాస్, అనుష్కల పెళ్లిపై కూడా మాట్లాడింది.

krishnam raju wife gives clarity about prabhas marriage
Prabhas : ఇది అసలు సంగతి..!
ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు. ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు”..అంటూ చెప్పుకొచ్చింది. ఇక అప్పుడు ఆమెకు అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళేనే అని అడగా..”ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. మీకు త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి” అంటూ సమాధానమిచ్చింది. ఇక దీని బట్టి ప్రభాస్ పెళ్లి పనులు బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతూనే ఉన్నాయి..కానీ బయటకు రానివ్వడం లేదు అనే టాక్ నడుస్తుంది. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.