Krithi Shetty : ముద్దంటే పడిచస్తున్న కృతి శెట్టి.. ప్రతి సినిమాలో ఆ సీన్ ఉండాల్సిందే అంటున్న బేబమ్మ

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 1:00 pm

Krithi Shetty : అదృష్టం అనేది కొంద‌రికి మాత్ర‌మే త‌లుపు త‌డుతుంది. అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ప్రస్తుతం తను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్నది. అంతేకాకుండా నితిన్ సినిమా, సూర్య సినిమాతో పాటు ప‌లు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది. ఇటీవలే దివారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.

అంతేకాకుండా ఇప్పుడు తన క్రేజ్ మాత్రం తార స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అంద‌రి మాదిరిగా కాకుండా చాలా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూ ఉంటుంది కృతి శెట్టి. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్ట్‌ల‌లో కూడా చాలా హుందాగా క‌నిపిస్తుంటుంది. కృతి శెట్టి చాలా సంప్రదాయ‌బ‌ద్ధంగా క‌నిపించినా కూడా జ‌నాలు తెగ పిచ్చెక్కిపోతుంటారు. అయితే, రీసెంట్ గా ఓ కోలీవుడ్ మీడియా తో ఇంటర్వ్యుల్లో ముచ్చటించిన ఈ కన్నడ బ్యూటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పి షాకిచ్చింది. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు గా దాని పై మీ అభిప్రాయం అని అడగ్గా..అంతా టీం వర్క్..

krithi shetty open about her sentiment

krithi shetty open about her sentiment

Krithi Shetty : కృతి సెంటిమెంట్..

ఒక్క హీరో వల్లే సినిమా హిట్ అవ్వదు..అలా అని హీరోయిన్స్ వల్లే ఫ్లాప్ అవ్వదు..ఏది జరిగిన అది మొత్తం ఆ సినిమా టీం వల్లే జరుగుతుంది..అంటూ చెప్పుకొచ్చింది.ఇక తన సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది.తన ప్రతి సినిమాలో హీరో తో బైక్ పై జామ్ జామ్ అని షికారుకి వెళ్ళాలి..అలా హీరోతో బైక్ సీన్స్ ఉంటే నా సినిమా మంచి విజయం అందుకుంటుందని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చిందట. ఇప్పటి వరకు వచ్చిన అన్ని కృతి సినిమాల్లో అలాంటి సీన్స్ ఉన్నాయి. అంతేకాదు ఇటీవ‌ల ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాల‌లో ముద్దు సీన్స్ కూడా కామ‌న్‌గా మారాయి. అవి కూడా సెంటిమెంట్‌గా భావించి కంటిన్యూ చేస్తుందా అని నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు?

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp