Kushboo Sundar : పాతికేళ్ల హీరోయిన్‌లా మారిందిగా.. కుష్బూ ఫిట్ నెస్ చూసి షాకైన త్రిష
Kushboo Sundar : సీనియర్ నటి కుష్బూ ఒకప్పుడు ఎంత లావుగా ఉండేదో అందరికీ తెలిసిందే. యమదొంగ, స్టాలిన్ సమయంలోనే కుష్బూ Kushboo Sundar ఎక్కువ లావుగా ఉండేది. ఇక చివరగా కుష్బూ నటించిన సినిమా ఏంటో అందరికీ తెలిసిందే. తెలుగులో కుష్బూ చివరగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్‌కు పిన్నిలా నటించింది. అందులోనూ కుష్బూ లావుగానే ఉంది.

Trisha Comments on Kushboo Sundar Latest pics
అయితే మధ్యలో మాత్రం కుష్బూ తన ఫిట్ నెస్ మీద బాగానే శ్రద్ద పెట్టినట్టుంది. దెబ్బకు సగానికి సగం వయసు తగ్గించేసుకున్నట్టు అయింది. మొన్నటికి మొన్న సుహాసిని బర్త్ డే వేడుకల్లో రమ్యకృష్ణ, కుష్బూ వేసిన డ్యాన్సులు, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే కుష్బూ ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది.

Trisha Comments on Kushboo Sundar Latest pics
శర్వానంద్ హీరోగా వస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కుష్బూ నటిస్తోంది. కుష్బూ తాజాగా కొన్ని ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. దీంట్లో కుష్బూ పాతికేళ్ల హీరోయిన్‌లా మారిపోయింది. నాజూగ్గా మారిపోయిన కుష్బూను చూసి త్రిష షాకైంది. మీరు మార్పు చెందిన విధానం ఎంతో బాగుందంటూ కామెంట్లు పెట్టేసింది. మొత్తానికి కుష్బూ ఫోటోలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Trisha Comments on Kushboo Sundar Latest pics