Lavanya Tripathi : అవి బోర్ కొట్టేశాయట.. లావణ్య త్రిపాఠి ప్లాన్ ఇదేనా?
Lavanya Tripathi : అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి తాను చేస్తోన్న పాత్రలు బోర్ కొట్టేశాయట. ఒక రకంగా చూస్తే అది కూడా నిజమే అనిపిస్తోంది. ఎప్పడూ కూడా ఓ ప్రయోగం చేయలేదు. హీరో పక్కన డ్యాన్సులు చేయడానికి ఐదారు డైలాగ్‌లు చెప్పడానికి మాత్రమే ఉన్నట్టుగా కనిపించింది. అందుకే అలాంటి పాత్రలు చేయడం బోర్ కొట్టేసిందంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది.

Lavanya Tripathi about Her Character In A1 Express
పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు, గ్లామర్ పాత్రలు చేసీ బాగా బోర్ కొట్టింది. కొత్తగా ఇంకేమన్నా ప్రయత్నించాలి అనుకుంటున్న సమయంలోనే.. ఓసారి సందీప్ కిషన్ నన్ను ముంబయిలో కలిశాడని అసలు కథ చెప్పింది. హాకీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నా అన్నారు. క్లుప్తంగా కథ చెప్పారు. వినగానే బాగా నచ్చింది. సందీప్‌కి చేస్తానని చెప్పా. ఇది ‘నట్‌పే తునై’ అనే తమిళ చిత్రానికి రీమేక్. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా దర్శకుడు కథలో 50శాతం వరకు మార్పులు చేశారు. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు కొందరు చేసే రాజకీయాల వల్ల అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అలా ఆటల వెనుకున్న రాజకీయ కోణాల్ని ఇందులో చర్చిస్తున్నాం. దీంతో పాటు చక్కటి ప్రేమకథ.. అన్ని రకాల వాణిజ్య హంగులు ఉంటాయని ఏ1 ఎక్స్ ప్రెస్ గురించి చెప్పింది.
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ప్లాన్ ఇదేనా?
అయితే రొటీన్ పాత్రలు చేసీ చేసీ బోర్ కొడుతోందని చెప్పడం వెనుకా ఓ ఉద్దేశ్యం ఉన్నట్టుంది. ఇకపై తన వద్దకు వచ్చే దర్శక నిర్మాతలకు ఓ హింట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కాస్త కొత్తగా ఉండే పాత్రలు అయితేనే రండి అన్నట్టుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.