Lavanya Tripathi : లావ‌ణ్య‌ని పెళ్లి చేసుకుంటాన‌ని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి.. అమ్మ‌డి రియాక్ష‌న్ ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lavanya Tripathi : లావ‌ణ్య‌ని పెళ్లి చేసుకుంటాన‌ని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి.. అమ్మ‌డి రియాక్ష‌న్ ఇదే..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Lavanya Tripathi : లావ‌ణ్య‌ని పెళ్లి చేసుకుంటాన‌ని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి.. అమ్మ‌డి రియాక్ష‌న్ ఇదే..!

Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో క‌లిసి న‌టించ‌గా, ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించి అది పెళ్లిగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. లావణ్య త్రిపాఠి.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . ఈ బ్యూటీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతుంది . టాప్ హీరోయిన్ అని కూడా చెప్పలేదు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. తనదైన స్టైల్ లో ముందుకెళ్తూ వచ్చింది.

Lavanya Tripathi ద‌టీజ్ లావ‌ణ్య‌..

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి చికిత్స తీసుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో లావణ్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారింది. లావణ్య కాలికి గాయం అవడం వల్లే, తను నడవలేని స్థితిలో ఉండటం వల్లే పవన్ ప్రమాణ స్వీకారానికి గన్నవరం రాలేకపోయింది అని తెలుస్తుంది. ఇటీవల పవన్ చిరంజీవి ఇంటికి వచ్చినపుడు కూడా లావణ్య యాక్టివ్ గా ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. గన్నవరం వెళ్లకపోవడంతో పవన్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది లావణ్య.అయితే కాలి గాయం వ‌ల‌న లావ‌ణ్య త్రిపాఠి ఖాళీగా ఉంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంది.

Lavanya Tripathi లావ‌ణ్య‌ని పెళ్లి చేసుకుంటాన‌ని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి అమ్మ‌డి రియాక్ష‌న్ ఇదే

Lavanya Tripathi : లావ‌ణ్య‌ని పెళ్లి చేసుకుంటాన‌ని అంత స్ట్రైట్‌గా అడిగేసాడేంటి.. అమ్మ‌డి రియాక్ష‌న్ ఇదే..!

అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.మీ లెగ్‌కి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ ఆరాలు తీయసాగారు.తనకు బాగానే ఉందని, కాస్త బెణికిందని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది.అనంతరం మరో నెటిజన్ మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే.పవర్ అని రిప్లై ఇచ్చింది. ఇంతలో ఒక నెటిజన్ వింతగా ప్రపోజ్ చేశాడు.ఈ జన్మలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.కానీ కుదర్లేదు. వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగగా.లావణ్య త్రిపాఠి స్పందిస్తూ. హిందూ మత విశ్వాసం ప్రకారం.పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు అని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది.లావణ్య తెలివిగా ఆన్సర్ ఇచ్చిందంటూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది